సాక్షి, న్యూఢిల్లీ : టోల్ ప్లాజాల వద్ద ప్రయాణీకుల సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేసేందుకు వన్ నేషన్ వన్ టాగ్ ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగపడుతుందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీలోని కేంద్ర రోడ్డు రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్ నేషన్ వన్ టాగ్ ఫాస్ట్ టాగ్ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వన్ నేషన్ వన్ టాగ్ ఫాస్ట్ టాగ్ కార్యక్రమ అమలుకు తమ ప్రభుత్వం తెలిపిన ఆమోదాన్ని కేంద్రానికి వెల్లడించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెండింగులో ఉన్న జాతీయ రహదారులు, రోడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తులపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణకు అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్రానికి వివరించినట్లు మంత్రి వేముల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment