సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ హౌసింగ్ కార్యక్రమాలపై మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి కావడానికి గడువు సమీపిస్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన ఈ ప్రక్రియ చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారుకు ఆదేశాలు జారీ చేశారు. హౌసింగ్ శాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషనర్ నగర పరిధిలో ఉన్న ఇతర జిల్లాల కలెక్టర్‌లతో కలిసి సంయుక్తంగా లబ్ధిదారుల ఎంపిక చేయాలని సూచించారు. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని, త్వరలోనే ఇవన్నీ పూర్తవుతాయని అధికారులు మంత్రులకు తెలియజేశారు. (క్రమబద్ధీకరణలో ఊరట)
దీనిపై స్పందించిన మంత్రులు లబ్ధిదారుల ఎంపిక పైన ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కోసం ఇతర జిల్లాల పరిధిలో కడుతున్న ఇళ్లలో పది శాతం లేదా 1000 మించకుండా స్థానికులకు ఇల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికపైన కసరత్తు చేయాలని, గతంలో ఇల్లు అందిన వారికి మరోసారి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాకుండా చూడాలని మంత్రులు సూచించారు. (కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు)
Comments
Please login to add a commentAdd a comment