సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తొలి సమీక్షలో సూచించిన విధంగా ప్రధాన బస్‌స్టేషన్లలో మినీ థియేటర్ల ఏర్పాటును వేగవంతం చేసే పనిలో టీఎస్‌ఆర్టీసీ నిమగ్నమైంది. గుర్తించిన కొన్ని ప్రత్యేకమైన బస్డాండ్‌ల్లో పటిష్టతను పరిశీలించిన తర్వాత ఏర్పాటు పనులను ప్రారంభించేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. టికెట్‌యేతర ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో భాగంగా సంస్థ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది.
ఇందుకు 72 ప్రధాన బస్టాండ్‌ల్లో మినీ థియేటర్ల నిర్మాణం, బడ్జెట్ హోటల్స్ ఏర్పాటు పనులను ముమ్మరం చేసింది. ఆయా బస్టాండ్లలో పటిష్టత ఎలా ఉంద నే అంశాలపై ఆర్ అండ్ డీ, జేఎన్‌టీయూ, నేషన ల్ వర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఆయా అంశాలపై పరిశీలన జరపనుంది. ఈ బృందం నిర్ధారించిన తర్వాత ఆయా బస్టాండ్లలో డార్మెంటరీ, బడ్జెట్ హోటల్స్‌తో పాటు థియేటర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment