Mini theaters
-
కొవ్వూరులో 7న ‘వై స్క్రీన్స్ మాల్’ ప్రారంభం
సాక్షి, అమరావతి : మిని డిజిటల్ థియేటర్ కాన్సెప్ట్‌తో బాగా ప్రాచుర్యం పొందిన వై స్క్రీన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ కొవ్వూరులో వై స్క్రీన్స్ మాల్‌ను ప్రారంభించనుంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వురులోని మెయిన్ బైపాస్ రోడ్డులో మంగళవారం(మే 7వ తేదీ) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుంది. వై స్క్రీన్స్ ట్రేడ్ డెవలప్మెంట్ సెంటర్(వైఎస్టీడీ సెంటర్) పేరిట ఏర్పాటు చేయనున్న ఈ మాల్‌లలో మిని డిజిటల్ థియేటర్, ప్రభుత్వ సేవలు అందించే మీసేవ, బ్యాంక్ ఏటీఎమ్‌లు, గేమింగ్ జోన్, కాఫీ షాప్స్, బ్రాండెడ్ వస్తువుల విక్రయశాలలు, కార్పొరేట్ ఆఫీస్ కార్యాలయాలు ఉండనున్నాయి. వై స్క్రీన్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్, ఎండీ వైవీ రత్నకుమార్ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లలో ఏర్పాటు చేసిన థియేటర్లు ప్రజల ఆధారాభిమానాలు పొందటంతోపాటు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. -
మినీ థియేటర్లు!
సాక్షి, ఆదిలాబాద్ : బస్సులు నడపడం ద్వారా వచ్చే ఆదాయానికే పరిమితం కాకుండా నష్టాల నుంచి గట్టెక్కడానికి ఆర్టీసీ సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఆర్టీసీ బస్స్టేషన్లు, డిపోల స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించే ఆలోచన చేస్తోంది. ఆర్టీసీ ఆస్తులపై ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీటికి సంబం ధించి ప్రతిపాదనలు తయారు చేస్తుండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఆర్టీసీ స్థలాల్లో వీటికిసంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించి పంపిం చారు. హైదరాబాద్‌లో ఈనెల 12న దీనికి సంబం ధించి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ఈ మినీ థియేటర్ల విషయంపై చర్చించనున్నారు. ఎక్కడెక్కడా.. మినీ థియేటర్ల విషయంలో ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు బస్స్టేషన్లు, డిపో స్థలాలు అనువుగా ఉన్నాయని ప్రతిపాదించారు. అందులో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆదిలాబాద్, ఉట్నూర్, జైనథ్, బోథ్, నిర్మల్ జిల్లా నుంచి భైంసా, ఖానాపూర్, సారంగాపూర్, మంచిర్యాల జిల్లా నుంచి మంచిర్యాల, చెన్నూర్, లక్సెట్టిపేట, జన్నారం, కుమురంభీం జిల్లా నుంచి కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, సిర్పూర్(టి) స్థలాలు అనువుగా ఉన్నాయని ప్రతిపాదనలు పంపారు. ఆయా ప్రాంతాల్లో పొటెన్షియల్‌ను బట్టి మినీ థియేటర్లు నిర్మించేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని బట్టి సినిమా షోలు అనువును అంచనా వేస్తూ పొటెన్షియల్‌ను పరిగణలోకి తీసుకుంటున్నారు. మినీ థియేటర్ కోసం 1500 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఉమ్మడి జిల్లాలోని పలు బస్స్టేషన్లు, డిపోల పరిధిలో స్థలాలు అందుబా టులో ఉన్నాయి. వాటిని వినియోగంలోకి తేవా లని ఈ ఆలోచన చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ ప్రాంతంలో అసలు థియేటర్లే లేకపోవడంతో అక్కడ ఇది ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా స్థలాలను బట్టి కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లో బస్‌డిపో స్థలాల్లో, మంచిర్యాలలో క్వార్టర్స్ ఉన్నచోట అనువుగా ఉంటుందని చెబుతున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో పొటెన్షియల్‌ను బట్టి అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. మిగతా స్థలాల్లో ప్రతిపాదనలు చేసినా అక్కడ పొటెన్షియల్ అంతగా ఉండదని, ఈ దృష్ట్యా అక్కడ తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (టీఎఫ్‌డీసీ) లీజు తీసుకునేందుకు ముందుకు వస్తుందా? లేదా అని మీమాంసలో ఉన్నారు.మంచిర్యాలలో ఇప్పటికే టీఎఫ్‌డీసీ అంగీకారం తెలిపినట్లు సమాచారం. నిర్మల్‌లో బస్టాండ్,మల్టీషాపింగ్ కాంప్లెక్స్ నిర్మల్‌లో నూతనంగా బస్టాండ్, మల్టీషాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రస్తుతం బస్టాండ్ ఉన్న పార్కింగ్ స్థలాల వెనుక లోతట్టు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. బస్టాండ్ నిర్మించి, దానిపైన మల్టీషాపింగ్ కాంప్లెక్స్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. వీటన్నింటికి సంబంధించి ఈనెల 12న అధికారులు సమాలోచనలు చేయనున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ డివిజన్లో ఆర్టీసీ బస్స్టేషన్ల ప్లాట్‌ఫాంల పెంపు, ఇతరత్ర అభివృద్ధి పనులు చేపట్టారు. ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు.. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, ఉట్నూర్, ఆసిఫాబాద్‌లో బస్‌డిపోలు ఉన్నాయి. రోజూ తిరిగే బస్సుల ద్వారా రూ.80లక్షల ఆదాయం లభిస్తోంది. అలాగే బస్టాండ్, డిపో స్థలాల్లోని వాణిజ్య సముదాయాల ద్వారా ఏడాదికి రూ.5కోట్ల ఆదాయం వస్తోంది. ఈ ఆదాయాన్ని పెంచేందుకు సంస్థ అడుగులు వేస్తోంది. ప్రధానంగా మినీ థియేటర్లను లీజుకు ఇవ్వడం, మల్టీషాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ద్వారా అదనంగా మరో రూ.కోటి ఆదాయాన్ని రాబట్టాలని ప్రణాళిక చేస్తోంది. ప్రతిపాదనలు పంపించాం ప్రభుత్వం ప్రతిపాదనలు కోరడంతో పంపించాం. ప్రధానంగా స్థలాలు అందుబాటులో ఉన్న దగ్గర ఈ ప్రతిపాదనలు చేశాం. అయితే పొటెన్షియల్‌ను బట్టి మినీ థియేటర్లు లీజుకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పలుచోట్ల మినీ థియేటర్ల కోసం ప్రతిపాదనలు చేసినప్పటికి అందులో కొన్నింటికి టీఎఫ్‌డీసీ ముందుకొచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా నిర్మల్‌లో మల్టీషాపింగ్ కాంప్లెక్స్, బస్టాండ్ నిర్మించాలని యోచిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ను అలాగే ఉంచి నూతన బస్టాండ్‌ను నిర్మించే ప్రతిపాదన ఉంది. – రవీంద్రనాథ్సింగ్, ఆర్టీసీ డిప్యూటీ ఈఈ -
మినీ థియేటర్ల ఏర్పాటులో ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తొలి సమీక్షలో సూచించిన విధంగా ప్రధాన బస్స్టేషన్లలో మినీ థియేటర్ల ఏర్పాటును వేగవంతం చేసే పనిలో టీఎస్ఆర్టీసీ నిమగ్నమైంది. గుర్తించిన కొన్ని ప్రత్యేకమైన బస్డాండ్ల్లో పటిష్టతను పరిశీలించిన తర్వాత ఏర్పాటు పనులను ప్రారంభించేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. టికెట్‌యేతర ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో భాగంగా సంస్థ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందుకు 72 ప్రధాన బస్టాండ్‌ల్లో మినీ థియేటర్ల నిర్మాణం, బడ్జెట్ హోటల్స్ ఏర్పాటు పనులను ముమ్మరం చేసింది. ఆయా బస్టాండ్లలో పటిష్టత ఎలా ఉంద నే అంశాలపై ఆర్ అండ్ డీ, జేఎన్టీయూ, నేషన ల్ వర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఆయా అంశాలపై పరిశీలన జరపనుంది. ఈ బృందం నిర్ధారించిన తర్వాత ఆయా బస్టాండ్లలో డార్మెంటరీ, బడ్జెట్ హోటల్స్‌తో పాటు థియేటర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. -
సినిమా చూపిస్తా మామా!
సాక్షి, హైదరాబాద్: బస్టాండ్లలో వివిధ కారణాల వల్ల వేచి ఉండాల్సిన ప్రయాణికులకు శుభవార్త. తమ ప్రాంగణాల్లో వినోదాన్ని అందించేందుకు మినీ థియే టర్లు నిర్మించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయిం చింది. ఆర్టీసీ ప్రతిపాదనకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ముందుకు వచ్చింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయి, టికెట్టేతర ఆదాయం కోసం వివిధ మార్గాలు అన్వేషిస్తోన్న ఆర్టీసీకి ఈ ఆలోచన కాసులు కురిపిస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మినీ థియేటర్ల నిర్మాణానికి చకాచకా అడుగులు వేస్తోంది. త్వరలో విజయవాడకు బృందం.. టికెట్టేతర ఆదాయం పెంపులో భాగంగా ఇప్పటికే పలు దుకాణాలను వేలం వేసిన ఆర్టీసీ, ఇకపై మినీ థియేటర్లను ఏర్పాటు చేయనుందని సంస్థ తాత్కాలిక ఎండీ సునీల్ శర్మ వెల్లడించారు. ఇప్పటికే ఇందుకోసం ఆర్టీసీకి చెందిన 23 స్థలాలను గుర్తించామని, ఇందులో 15 ప్రాంగణాల్లో మినీ థియేటర్లు నిర్మించేందుకు టీఎఫ్‌డీసీ ముందుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ థియేటర్ల ద్వారా ఏటా రూ. 3.11 కోట్ల ఆదాయం సమకూరనుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో పండిట్‌నెహ్రూ బస్టాండ్‌లో ఇలాంటి మినీథియేటర్ నడుస్తోంది. ఈ మినీ థియేటర్ నిర్వహణ పని తీరును పరిశీలించేందుకు త్వరలోనే ఈడీ పురుషోత్తమ్ నేతృత్వం లోని బృందం విజయవాడ వెళుతుందని ఆయన వివరించారు. ఏయే ప్రాంతాల్లో.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొల్లూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, ధర్మపురి, హుజూరాబాద్, సిరిసిల్ల, పెద్ద పల్లి, జడ్చర్ల, షాద్‌నగర్, నర్సా పూర్, సంగారెడ్డి, నాగార్జున సాగర్, కోదాడ, ఆర్మూర్, బోధన్, చేవెళ్ల, తాండూరు, వికారాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. -
మినీ థియేటర్స్ కోసం
రానున్న రోజుల్లో బస్టాండ్స్‌లో మినీ థియేటర్స్ ప్రత్యక్షం కానున్నాయి. దాని కోసం కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, అధ్యక్షుడు పి. రామ్మోహనరావులు పలువురు అధికారులతో చర్చించి, తెలంగాణా చలన చిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్టీసీ బస్టాండ్స్‌లో మినీ థియేటర్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు బస్టాండ్స్‌లో, వాటికి సంబంధించిన ఖాళీ స్థలాల్లో 80 నుంచి 100 మినీ థియేటర్ల ఏర్పాటుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణతోనూ రామ్మోహన్ రావు చర్చించారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సిందిగా టెండర్లను ఆహ్వానించినా సరైన స్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, మినీ థియేటర్ల ఏర్పాటుకు తగిన అనుమతులు తీసుకోవాలనుకుంటున్నాం’’ అని రామ్మోహనరావు అన్నారు. -
మినీ థియేటర్లు.. ఆన్లైన్లో టికెట్లు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభి వృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్ ప్రారంభమైంది. ‘టీఎస్‌బాక్స్ ఆఫీస్.ఇన్’ ద్వారా ఆన్లైన్ టికెట్స్ పొందొచ్చు. అలాగే షూటింగ్‌ల కోసం సింగిల్ విండో అనుమతులు అందించే ఆన్లైన్ విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ రెండింటిని ప్రారంభిం చుకోవడం నిర్మాతలకు, ప్రేక్షకులకు, థియేటర్ యజమానులకు ఎంతో ఉపయోగకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సచివాలయంలో ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్, సింగిల్ విండో అనుమతుల విధానాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ రాంమోహన్‌రావు, ఎఫ్డీసీ ఎండీ నవీన్ మిట్టల్, జేఎండీ కిషోర్ బాబు, సినీ ప్రముఖులు దిల్ రాజు, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీ వేసిందని, వారికి ఉపయోగపడే ఎన్నో నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసం ఐదో ఆట ప్రదర్శనకు అనుమతులు ఇస్తామన్నారు. సినిమా షూటింగ్‌ల కోసం వివిధ శాఖల నుంచి అనుమతుల కోసం నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీఎస్ఎఫ్డీసీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఏడు రోజుల్లోపు అన్ని అనుమతులు మంజూరవుతాయన్నారు. ఏడురోజుల్లో అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లుగానే పరిగణించి షూటింగ్ ప్రారంభించుకోవచ్చన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం స్టూడియో నిర్మాణానికి సంబంధించి స్థలం ఎంపిక కోసం దీపావళి తరువాత పర్యటిస్తామన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని వివరించారు. సినీ అవార్డుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి అధ్యక్షతన కమిటీ సమావేశమయ్యిందని, మార్గదర్శకాలు తయారుచేసి సీఎం అనుమతితో నిర్వహిస్తామన్నారు. రమణాచారి మాట్లాడుతూ ఫిలిం ఇన్స్టిట్యూట్ ద్వారా సినీ విభాగాల్లో ఎంతో మంది శిక్షణ పొందే అవకాశం లభిస్తుందన్నారు. ఎఫ్డీసీ ఛైర్మన్ రాంమోహన్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. చిత్ర పరిశ్రమలో సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగుతామన్నారు. నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ప్రేక్షకులకు, నిర్మాతలకు ఆన్లైన్ పోర్టల్ విధానం ఉపయోగపడుతుందన్నారు. టీఎస్ ఐపాస్ తరహాలోనే ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్‌ను ప్రారంభించామని, భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆన్లైన్ అనుమతులకు సంబంధించి ప్రతి శాఖలో ఒక నోడల్ అధికారి ఉంటారని వీరందరు ఏడురోజుల్లో ఆన్లైన్ అనుమతులు ఇస్తారన్నారు. -
సినిమా చూపిస్త మావ..
⇒ బస్టాండ్లలో మినీ థియేటర్లు ⇒ ప్రతి పట్టణంలో ఒకటి ఉండేలా ఆర్టీసీ ప్రణాళిక ⇒ 354 థియేటర్ల నిర్మాణానికి ముందుకొచ్చిన బడా సంస్థ సాక్షి, హైదరాబాద్: ఎక్కాల్సిన బస్సు మిస్సవుతుంది. తరువాత బస్సుకు రెండుమూడు గంటల సమయం పడుతుంటుంది. అప్పటి వరకు ఏం చేయాలి! బస్టాండుల్లో పడిగాపులు కాసేకంటే హాయిగా, ఏసీ హాలులో కూర్చుని ‘కూల్’గా ఓ సినిమా చూసొచ్చి తర్వాతి బస్సు అందుకోవచ్చని పిస్తుంది. అందకు ఎక్కడో ఉన్న థియేటర్‌కు వెళ్లి రావాలంటే వ్యయ ప్రయాసలు... పైగా సమయానికి బస్సు అందుకోగలమో లేదో టెన్షన్! అదే బస్టాండులోనే ఓ సినిమా హాలుంటే! ఈ ఆలోచనకే కార్యరూపం ఇస్తోంది ఆర్టీసీ. ప్రయాణికులకు వినోదాన్ని కల్పించడమే కాకుండా... తద్వారా ఆదాయం పొందే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా బస్టాండుల్లో మినీ థియేటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వానికి ప్రతిపాదన... దేశీయంగా మినీ థియేటర్ల నిర్వహణలో మంచి పేరున్న ఓ బడా కంపెనీ తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్లలో 354 మినీ థియేర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో వాటి నిర్మాణానికి అనుమతితోపాటు, విధివిధానాల నోటిఫికేషన్ కోసం ఆర్టీసీ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అది రాగానే టెండర్లు పిలిచి థియేటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పట్టణంలోని బస్టాండులో కనీసం ఓ మినీ థియేటర్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నిబంధనల సడలింపుతో స్పందన ప్రస్తుతం బస్సుల నిర్వహణతోనే ఆదాయాన్ని పొందుతున్న ఆర్టీసీ పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరు కుపోయింది. గతంలో తీసుకున్న అప్పుల తాలూకు వడ్డీలు, పాత బకాయిలు సంస్థకు గుదిబండగా మారాయి. కచ్చితంగా ప్రత్యామ్నా య రూపంలో ఆదాయాన్ని పొందాల్సిన పరిస్థితిలో బీఓటీ (నిర్మించు, నిర్వహించు, అప్పగిం చు) పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేకంగా టిక్కెటేతర ఆదాయం కోసం రెవెన్యూ విభాగాన్ని ఏర్పాటు చేసింది. దానికి అధికారి వేణును ఈడీగా నియమించింది. కనీసం 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమైనందున అంతమేర విశాలమైన భవనాలున్న చోట పైభాగంలో థియేటర్లు నిర్మిస్తారు. భవనాలు లేని చోట బస్టాండులోని ఖాళీ స్థలంలో నిర్మిస్తారు. నిర్మాణ సంస్థలను ఆకట్టుకునేందుకు అసెస్మెంట్ ఆఫ్ ల్యాండ్ వాల్యూ, అప్పెరంట్ వ్యాల్యూను తగ్గించారు. ప్రాజెక్టు అప్పగించిన తొలి నెల నుంచే ఆర్టీసీకి వాటా చెల్లించాల్సి ఉండగా, దాన్ని నిర్మాణ సమయం పూర్తయ్యే వరకు వసూలు చేయాల్సిన అవసరం లేకుండా కనిష్టంగా రెండేళ్ల హాలీడే ప్రకటించారు. కనీసం రూ.100 కోట్ల విలువైన ప్రాజెక్టు అయితే రెండేళ్లు, అంతకంటే విలువ ఎక్కువున్న ప్రాజెక్టులకు మూడేళ్ల హాలీడే ప్రకటించారు. వార్షిక లీజ్ రెంటల్‌ను కూడా తగ్గించారు. లీజు ఒప్పందం పూర్తయ్యాక, ఆసక్తి ఉంటే మరో 25 ఏళ్లపాటు నిర్వహించుకునేందుకు కేటాయించే విషయంలో ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. దీంతో నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి. ముందుకొచ్చిన 14 సంస్థలు... తాజాగా మినీ థియేటర్లకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన విడుదల చేయటంతో 14 సంస్థలు ముందు కొచ్చాయి. మినీ థియేటర్లతో పాటు ఇతర బీఓటీ ప్రాజెక్టుల వల్ల ఆదాయం ఎలా ఉంటుందనే విషయంలో అధ్యయనం కోసం ఈడీ వేణు ఆధ్వర్యంలో అధికారులు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, కేరళ తదితర రాష్ట్రాల్లో పర్యటించను న్నారు. -
సినిమా చూడాలా.. బస్టాండ్‌కు వెళ్లండి!
మొదట గ్రేటర్ బస్టాండ్లలో అందుబాటులోకి అనంతరం ఎంజీబీఎస్, జేబీఎస్ సహా అన్ని చోట్ల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు వినోదభరితమైన కబురు... సరదాగా సినిమాకి వెళ్లాలనుకుంటున్నారా... ఇక మీరు సినిమాల కోసం ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లినా చాలు.. అవును, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలే ఇక మినీ థియేటర్లుగా అవతరించనున్నాయి. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లతో పాటు గ్రేటర్‌లోని అన్ని ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్లు రాబోతున్నాయి. హయత్‌నగర్, ఈసీఐఎల్, కాచిగూడ, కోఠి, కూకట్పల్లి, పటాన్‌చెరులలోని బస్స్టేషన్లలో మినీ థియేటర్లను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. పటాన్‌చెరులోని ప్రయాణ ప్రాంగణంలో త్వరలో మినీ థియేటర్‌ను ప్రారంభించనున్నారు. ఒక్కో థియేటర్లో 125 నుంచి 150 మంది వరకు కూర్చొనేలా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు అద్దెకు ఇచ్చిన తరహాలోనే మినీ థియేటర్లను కూడా అద్దెకు ఇస్తారు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను గట్టెక్కించేందుకు టిక్కెట్‌పైన వచ్చే ఆదాయంపై మాత్రమే ఆధారపడకుండా ఇతర మార్గాలను సైతం అన్వేషించాలన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు ఆర్టీసీ ఈ కార్యాచరణ చేపట్టింది. మొదట నగరంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్లను అందుబాటులోకి తెచ్చిన అనంతరం మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లలోనూ ఏర్పాటు చేస్తారు. -
వ్యవసాయోత్పత్తుల కోసం ‘స్వదేశ్’ మాల్స్..
మండల కేంద్రాల్లో ఏర్పాటు; మాల్స్‌లో మినీ థియేటర్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ, విదేశీ బ్రాండ్ల ఔట్లెట్లతో నిండిన మాల్స్ కాకుండా... వ్యవసాయోత్పత్తులు, స్థానిక కంపెనీలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి కూడా సరికొత్త మాల్స్ రాబోతున్నాయి. పెపైచ్చు ఇవి మండల కేంద్రాలకే పరిమితం కానున్నాయి. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్వదేశ్ గ్రూప్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యాపారావకాశాలను గుర్తించి మాల్స్ తరహాలో స్వదేశ్ బజార్స్‌ను ఏర్పాటు చేయటానికి ముందుకొచ్చింది. రైతులు పండించిన ఉత్పత్తులు, స్థానికంగా చేతివృత్తులవారు, చిన్న కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులు వీటిలో విక్రయిస్తారు. రైతులు, తయారీదారులు స్వయంగా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చని గ్రూప్ ప్రాజెక్ట్స్ డెరైక్టర్ ఎం.కృష్ణ ప్రసాద్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. తొలి కేంద్రం మేడ్చల్ వద్ద: స్వదేశ్ గ్రూప్ తొలి స్వదేశ్ బజార్‌ను హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద నెలకొల్పుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ దశలవారీగా ఇతర మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు గ్రూప్ సలహాదారు, ఎంకే ఇంటర్నేషనల్ గ్రూప్ డెరైక్టర్ హరికృష్ణ మారం తెలిపారు. బజార్ల స్థాపనకు కావాల్సిన పెట్టుబడిని స్వదేశ్ గ్రూప్ కంపెనీలు సమకూరుస్తాయన్నారు. వివిధ బ్రాండ్లకు థర్డ్ పార్టీగా ఉన్న తయారీ ప్లాంట్ల నుంచి దుస్తులు, పానీ యాలు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసి సొంత బ్రాండ్‌లో తక్కువ ధరకు విక్రయిస్తామని తెలియజేశారు. స్వదేశ్ బజార్లోనే మినీ థియేటర్లు నిర్మిస్తారు. స్వదేశ్ గ్రూప్‌ను యూఎస్‌తోపాటు పలు దేశాల్లో ఉన్న ఇన్వెస్టర్లు ప్రమోట్ చేస్తున్నారు. -
మినీ థియేటర్లపై దృష్టి
సామాన్యులకు అందుబాటు టికెట్ ధరలో సినిమా థియేటర్ల ఏర్పాటు, పది వేలకు పైగా జనాభా ఉండే మండల కేంద్రాల్లో మినీ థియేటర్ల ఆవశ్యకత... ఇలా పలు అంశాలను తెలంగాణ ప్రొడ్యూసర్స్ అండ్ మినీ థియేటర్స్ ఓనర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. సొసైటీ అధ్యక్షుడు సానా యాదిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అల్లాణి శ్రీధర్, కార్యదర్శి సంగిశెట్టి దశరథ, కార్యవర్గ సభ్యులు లయన్ పి. అమ్రిష్‌కుమార్, టి టాకీస్ టెక్నికల్ హెడ్ బల్వంత్ సింగ్, కృష్ణారావు తదితరులు కేసీఆర్‌ను కలిసినవారిలో ఉన్నారు. ‘‘డిజిటల్ మినీ థియేటర్ల నిర్మాణానికి సింగిల్ విండో పద్ధతిలో అనుమతి, తెలంగాణ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌గారు అన్నారు. ఆయన స్పందించిన విధానం ఆనందాన్నిచ్చింది’’ అని సానా, అల్లాణి శ్రీధర్ తదితరులు తెలిపారు.