
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనలు లేవని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రవాణా శాఖ ఆదాయంలో దేశంలోనే నాల్గో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈ మధ్య ఆర్టీఏలో కార్డ్స్ అందుబాటులో లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఐదు వేల రిబ్బన్స్ అవసరం ఉంటే రెండు వేలు మాత్రమే అందించారని అన్నారు. 2.30లక్షల కార్డ్స్ ప్రింట్ చెయాల్సి ఉందన్నారు. వీటిని రాబోయే 15రోజుల్లో ప్రింటింగ్ చేస్తామని తెలిపారు.
రవాణా శాఖలో మరిన్ని మార్పులను తీసుకొస్తామని అన్నారు. తెలంగాణ రవాణా శాఖపై కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. కమిటీ 15రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజల సౌకర్యం కోసం ఫిర్యాదలు అందించడానికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటి నుంచి నెలకొకసారి ఫిర్యాదులపై మంత్రి కార్యాలయానికి రిపోర్ట్ ఇస్తుందన్నారు. ఆర్టీఏలో మొబైల్‌యాప్‌ను అందుబాటులోకి తెస్తామని అన్నారు. 2018-19లో ఏడు కోట్ల పర్మిట్ ఫీజులను వసూళ్లు చేశామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment