సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్దం కావడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. సభలోకి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, జీరో అవర్‌లో కూడా మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చాలా మంది తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని మాకు చెప్తున్నారు.. కానీ మాకు అవకాశం ఇవ్వకపోతే మేము ఎలా మాట్లాడేదని ప్రశ్నించారు.
అసెంబ్లీ నిర్వహాణ పట్ల ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ.. ‘సభలో అధికార పార్టీ బుల్డోజ్ చేస్తుంది. బీఆర్‌ఎస్ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇస్తే.. ప్రతీ ఊళ్ళో వాటర్ ప్లాంట్‌లు ఎందుకు పెట్టుకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంత సేపు మాట్లాడినా మైక్ కట్ చేయరు. మాకు ఓక నిమిషం మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు. అసెంబ్లీలో లేని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు.
ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ సభను వాడుకుంటుంది. నాలుగున్నర సంవత్సరాల క్రితం ఎన్నికైన సభ్యులు సభలో ఉంటే 9 ఏళ్ళ ప్రగతి గురించి చర్చ ఎలా చేపడుతున్నారు. సమస్యలు లేనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జీరో అవర్‌లోలో ఎందుకు అవకాశం ఇస్తున్నారు. సభ నిర్వాహణ మాలాంటి వారికి భాధ కలిగిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
చదవండి: ఎన్నికల వేళ ఇదేం గోల?.. కాంగ్రెస్ నేతలకు క్లాస్.. అయినా!
Comments
Please login to add a commentAdd a comment