
సాక్షి, వరంగల్ : తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించి ఆదాయం కోసం హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్ముతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కిష్టపురం క్రాస్ రోడ్డు వద్ద ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఓటమి భయంతోనే హుజూర్‌నగర్‌లో మండలానికో మంత్రి, గ్రామానికో ఎమ్మెల్యేను పంపుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని విశ్వాసం వెలిబుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment