ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు, మంత్రి కేటీఆర్ లపై ప్రతిపక్ష నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అధికార టీఆర్ఎస్ పార్టీ రెండేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తిచేస్తానని చెప్పడం సత్యదూరం. రాష్ట్రం కాదు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగినా రెండేళ్లలో పూర్తిచేయలేదు. మంత్రి హరీశ్ రావుకు ఇదే నా సవాల్.. ఒకవేళ టీఆర్ఎస్ ఆ పని చేయగలిగితే.. ఆ పార్టీ తెలంగాణకు గొప్పధనమని నిరంతరం చెబుతా' అని వ్యాఖ్యానించారు.