కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎవరిని నియమిస్తారనే అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం సంకేతాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎవరిని నియమిస్తారనే అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కేబినెట్ ర్యాంకు హోదా కలిగిన ప్రతిపక్షనేత పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సగం మందికిపైగా పోటీ పడుతున్నారు. మాజీ మంత్రులు కె.జానారెడ్డి, డీకే అరుణ, జె.గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టి.జీవన్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ప్రధానంగా రేసులో ఉన్నారు. ఈ విషయంలో ఎవరికి వారే పెద్ద ఎత్తున లాబీయింగ్ మొదలుపెట్టారు. అయితే, ఎమ్మెల్యేల మధ్య నున్న పోటీని గమనించిన అధిష్టానం పెద్దలు.. ఓటింగ్ ద్వారా సీఎల్పీ నేతను ఎన్నుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తనను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ మేరకు పరోక్ష సంకేతాలిచ్చినట్లు సమాచారం.