శ్రీనగర్‌లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్‌ శాతం? | Live Polling In Srinagar Lok Sabha Seat | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్‌ శాతం?

Published Mon, May 13 2024 11:00 AM | Last Updated on Mon, May 13 2024 11:11 AM

Live Polling In Srinagar Lok Sabha Seat

శ్రీనగర్‌ లోక్‌సభ సీటుకు ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్‌ ప్రారంభమయ్యింది. శ్రీనగర్‌, పుల్వామా, బడ్గామ్‌, గందర్‌బల్‌, షోపియాతో పాటు 18 అసెంబ్లీ స్థానాల్లో 17.47 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. శ్రీనగర్‌ లోక్‌సభకు 24 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

శ్రీనగర్‌ లోక్‌సభ సీటు ఉదయం 9 గంటల వరకూ 5.7 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారిగా శ్రీనగర్‌లో  ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఎటువంటి హింసాయుత ఘటనలు గానీ, ఎన్నికల బహిష్కరణ పిలుపులు గానీ చోటుచేసుకోలేదు. ఈ నేపధ్యంలో శ్రీనగర్‌లో ఓటింగ్‌ గత రికార్డులను అధిగమించవచ్చనే అంచనాలున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement