sri nagar
-
జమ్ము కశ్మీర్ శ్రీనగర్‌లో భారీ ఉగ్రదాడి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఆదివారం శ్రీనగర్ సండే మార్కెట్లోని టూరిస్ట్ సెంటర్ ఆఫీస్(TRC)పై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారు. ఈ దాడిలో పది మందికి(12 మంది) పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. శ్రీ నగర్ నగరానికి గుండెకాయగా చెప్పుకునే లాల్ చౌక్‌ను ఆనుకున్న రోడ్డులోనే సండే మార్కెట్ పేరిట వారాంతపు సంత నిర్వహిస్తారు. మార్కెట్ కారణంగా టీఆర్సీ గ్రౌండ్లో విపరీతమైన జన రద్దీ నెలకొంది. ఇదే అదనుగా భావించిన ఉగ్రవాదులు మైదానంలోకి గ్రనేడ్లు విసిరినట్లు స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. దాడి జరిగిన వెంటనే పారామిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు చేర్చాయి. ప్రస్తుతం అక్కడ ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. లష్కరే తాయిబా గ్రూప్‌కు చెందిన టాప్ కమాండర్ ఒకరిని.. ఖన్యార్ ప్రాంతంలో భారత సైన్యం మట్టుపెట్టింది. ఆ మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం. #BREAKINGGrenade attack in Srinagar's busy Sunday market injures 5 civiliansIncident occurred near the heavily-guarded Tourist Reception Centre (TRC)Comes a day after security forces neutralized top Lashkar-e-Taiba commander in downtown #Srinagar. Security forces on site… pic.twitter.com/iaWl1NJNL9— Nabila Jamal (@nabilajamal_) November 3, 2024ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో అక్కడ వరుసగా ఉగ్రవాద కదలికలు పెరిగాయి. గత వారం రోజులుగా మూడు ఎన్కౌంటర్లు జరిగాయి. అంతకు ముందు నుంచే సైనిక వాహనాలపైనా దాడులు జరుగుతున్నాయి. దీంతో భద్రతా బలగాలు కూంబింగ్ కట్టుదిట్టం చేశాయి. ఒకవైపు సైనికులు.. మరోవైపు అమాయక ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వరుస ఉగ్రదాడి ఘటనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో టెర్రరిస్టుల దాడులు దురదృష్టకరమని , సరిహద్దుల్లో ఎలాంటి భద్రతా లోపం లేదని.. ఉగ్రవాదులకు భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తున్నాయని చెప్పారు.ఇదీ చదవండి: కశ్మీర్ ఓటమి.. కమలం పార్టీ కీలక నిర్ణయం -
శ్రీనగర్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం
జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని కెల్లర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఒక వంతెన కూలిపోయింది. శ్రీనగర్‌లోని అనేక రహదారులు జలమయమ్యాయి. వరదల కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.శ్రీనగర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనాన్ని పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-పూంచ్ హైవేను మూసివేశారు. ఆగస్టు 18, 19 తేదీల్లో రాజోరి, రియాసి, రాంబన్, జమ్ము, ఉధంపూర్, సాంబా, కథువా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో 64 నుంచి 115 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.శ్రీనగర్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. గందర్బల్ జిల్లాలోని హస్నాబాద్ కంగన్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. జమ్మూలోని విక్రమ్ చౌక్, ఓల్డ్ సిటీ, భగవతి నగర్, కెనాల్ రోడ్, తలాబ్ టిల్లో, జానీపూర్, రిహారి తదితర ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. కథువా, రియాసీలో తేలికపాటి వర్షం కురిసింది. -
శ్రీనగర్‌లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
శ్రీనగర్ లోక్‌సభ సీటుకు ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమయ్యింది. శ్రీనగర్, పుల్వామా, బడ్గామ్, గందర్బల్, షోపియాతో పాటు 18 అసెంబ్లీ స్థానాల్లో 17.47 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. శ్రీనగర్ లోక్‌సభకు 24 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.శ్రీనగర్ లోక్‌సభ సీటు ఉదయం 9 గంటల వరకూ 5.7 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా శ్రీనగర్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఎటువంటి హింసాయుత ఘటనలు గానీ, ఎన్నికల బహిష్కరణ పిలుపులు గానీ చోటుచేసుకోలేదు. ఈ నేపధ్యంలో శ్రీనగర్‌లో ఓటింగ్ గత రికార్డులను అధిగమించవచ్చనే అంచనాలున్నాయి. #WATCH | Jammu and Kashmir: Voters queue up outside a polling booth in GanderbalNational Conference (NC) has fielded Aga Syed Ruhullah Mehdi from the Srinagar Lok Sabha seat, PDP fielded Waheed-ur-Rehman Para, and J&K Apni Party’s fielded Mohammad Ashraf Mir.… pic.twitter.com/lIKrAFPfSe— ANI (@ANI) May 13, 2024 -
Bharat Jodo Yatra: హింసను ప్రేరేపిస్తున్నారు
శ్రీనగర్: ‘‘దేశంలో స్వేచ్ఛాయుత, లౌకిక విలువలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ, ఆరెస్సెస్ నిత్యం దాడి చేస్తున్నాయి. వాటికి పాతర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం నిరంతరం హింసను ప్రేరేపిస్తున్నాయి’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఆ విలువల పరిరక్షణకే భారత్ జోడో యాత్ర చేపట్టినట్టు పునరుద్ఘాటించారు. జోడో యాత్ర సోమవారం జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసింది. సభలో రాహుల్, ప్రియాంక, ఖర్గే, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా తదితరులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీని, షేర్ ఏ కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో సభ నిర్వహించింది. దీనిలో తొమ్మిది విపక్ష పార్టీల నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా విపరీతంగా కురుస్తున్న మంచులో తడుçÜ్తూనే రాహుల్ మాట్లాడారు. హింస ఎంతటి బాధాకరమో మోదీ లాంటివారికి ఎన్నటికీ అర్థం కాదంటూ ఆక్షేపించారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్‌గాంధీల హత్యోదంతాలను గుర్తు చేసుకున్నారు. ‘‘వారిక లేరని ఫోన్ కాల్స్ ద్వారానే తెలుసుకున్నా. ఆ దుర్వార్తలు విని విలవిల్లాడిపోయా. అలాంటి ఫోన్ కాల్స్ అందుకోవాల్సి రావడంలో ఉండే అంతులేని బాధను, నొప్పిని కశ్మీరీలు అర్థం చేసుకోగలరు. పుల్వామా వంటి ఉగ్ర దాడులకు బలైన ఆర్మీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది కుటుంబాలు అర్థం చేసుకోగలవు. నేను, నా చెల్లెలు అర్థం చేసుకోగలం. అంతేగానీ మతిలేని హింసను ప్రేరేపించే మోదీ, అమిత్ షా (కేంద్ర హోం మంత్రి), అజిత్ దోవల్ (జాతీయ భద్రతా సలహాదారు), ఆరెస్సెస్ నేతల వంటివాళ్లు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే దాని తాలూకు బాధను వాళ్లెప్పుడూ అనుభవించనే లేదు’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘సైనికుడు కావచ్చు, సీఆర్పీఎఫ్ జవాను కావచ్చు, కశ్మీరీ కావచ్చు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తమ వారు ఇక లేరనే దుర్వార్త మోసుకొచ్చే అలాంటి ఫోన్ కాల్స్‌కు శాశ్వతంగా తెర దించడమే జోడో యాత్ర లక్ష్యం. అంతే తప్ప నా స్వీయ లబ్ధి కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు. దేశ ప్రజల కోసం. దేశ పునాదులను నాశనం చేయజూస్తున్న భావజాలానికి అడ్డుకట్ట వేయడమే మా లక్ష్యం’’ అని స్పష్టం చేశారు. కశ్మీర్లో నడవాలంటే వారికి భయం బీజేపీ అగ్ర నేతలకు దమ్ముంటే తనలా జమ్మూ కశ్మీర్లో పాదయాత్ర చేయాలని రాహుల్ సవాలు విసిరారు. ‘‘అది వారి తరం కాదు. చేయలేరు. ఒక్కరు కూడా జమ్మూ కశ్మీర్లో నాలా నడవలేరు. ఎందుకంటే వారికి అంతులేని భయం’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘కశ్మీర్లో పాదయాత్ర వద్దని నాకు సలహాలొచ్చాయి. బులెట్ ప్రూఫ్ కార్లో చేయాలని స్థానిక యంత్రాంగమూ సూచించింది. నడిస్తే నాపై ఏ గ్రెనేడో వచ్చి పడొచ్చని హెచ్చరించింది. బహుశా నన్ను భయపెట్టడం వారి ఉద్దేశం కావచ్చు. కానీ నేను భయపడలేదు. నన్ను ద్వేషించేవారికి నా తెల్ల టీ షర్టు రంగు (ఎర్రగా) మార్చే అవకాశం ఎందుకివ్వకూడదని ఆలోచించా. ఈ రాష్ట్రం నా సొంతిల్లు. కశ్మీరీలు నావాళ్లు. వాళ్లతో కలిసి నడిచి తీరాలని నిర్ణయించుకున్నా. కశ్మీరీలు నాపై గ్రనేడ్లు విసరలేదు. హృదయపూర్వకంగా అక్కున చేర్చుకున్నారు. అంతులేని ప్రేమతో ముంచెత్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మనస్ఫూర్తిగా స్వాగతించి నన్ను తమవాణ్ని చేసుకున్నారు’’ అంటూ ప్రశంసించారు. ‘‘నాకు లేనిదీ, బీజేపీ నేతలకున్నదీ భయమే. నిర్భయంగా జీవించడాన్ని మహాత్మా గాంధీ నుంచి, నా కుటుంబం నుంచి నేర్చుకున్నా’’ అన్నారు. కాంగ్రెస్ ర్యాలీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వద్రాతో పాటు డీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ), సీపీఐ, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, వీసీకే, ఐయూఎంఎల్ నేతలు మాట్లాడారు. 22 పార్టీలకు ర్యాలీకి కాంగ్రెస్ ఆహ్వానం పంపగా తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, జేడీ(యూ) తదితర ముఖ్య పక్షాలు గైర్హాజరయ్యాయి. సోదరితో సరదాగా... భారీ భద్రత, యాత్ర, రాజకీయాలు, ప్రసంగాలు, విమర్శల నడుమ రాహుల్ కాసేపు సోదరి ప్రియాంకతో సరదాగా స్నోబాల్ ఫైట్ చేస్తూ సేదదీరారు. సంబంధిత ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక వీడియోలో రాహుల్ రెండు మంచు ముక్కలను వెనక దాచుకుని ప్రియాంకను సమీపించి ఆమె తలపై కొట్టి ఆట పట్టించారు. ఆమె కూడా ఆయన వెంట పడి తలంతా మంచుతో నింపేశారు. తర్వాత జోడో యాత్ర క్యాంప్ సైట్ వద్ద, అనంతరం పీసీసీ కార్యాలయంలోనూ రాహుల్ జాతీయ జెండా ఎగురవేశారు. యాత్రలో తనతో పాటు కలిసి నడిచిన భారత యాత్రీలకు కృతజ్ఞతలు తెలిపారు. వణికించే చలిలోనూ ఇన్ని రోజులుగా కేవలం తెల్ల టీ షర్టుతోనే యాత్ర చేసిన రాహుల్ ఎట్టకేలకు సోమవారం జాకెట్ ధరించారు. తర్వాత పొడవాటి సంప్రదాయ బూడిద రంగు కశ్మీరీ ఫేరన్ ధరించి ర్యాలీలో, సభలో పాల్గొన్నారు. ఇదే సొంతిల్లు కశ్మీర్ తన సొంతిల్లని రాహుల్ పదేపదే గుర్తు చేసుకున్నారు. ‘‘రాష్ట్రంలో నడుస్తుంటే అప్పుడెప్పుడో సరిగ్గా ఇవే దారుల గుండా నా పూర్వీకులు కశ్మీర్ నుంచి అలహాబాద్ వెళ్లారన్న ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. నేను నా ఇంటికి తిరిగొస్తున్నట్టు ఫీలయ్యా. ఎందుకంటే నాకంటూ ఓ ఇల్లు లేదు. చిన్నతనం నుంచీ ప్రభుత్వ ఆవాసాల్లోనే బతికాను. వాటిని నా ఇల్లని ఎప్పుడూ అనుకోలేకపోయాను. నా వరకూ ఇల్లంటే ఓ ఆలోచన. జీవన విధానం. కశ్మీరియత్ శివుని ఆలోచనా ధార. శూన్యత్వం. అహంపై పోరాడి గెలవడం. ఇది నన్నెంతో ఆకట్టుకుంది. దీన్నే ఇస్లాంలోనూ ఫనా అన్నారు. అస్సాం, కర్నాటక, మహారాష్ట్ర... అన్ని రాష్ట్రాల్లోనూ ఈ భావధార ఉంది. దీన్నే గాంధీ వైష్ణో జనతో అన్నారు. నా పూర్వీకులు ఇక్కణ్నుంచి వెళ్లి అలహాబాద్‌లో గంగా తీరాన స్థిరపడి కశ్మీరియత్‌ను యూపీలో ప్రచారం చేశారు. అదే గంగా యమునా పవిత్ర సంగమం’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నా ఇంటికి వెళ్తున్నట్టు అన్పిస్తోంది’ అంటూ జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించే ముందు తల్లి సోనియాకు, తనకు రాహుల్ మెసేజ్ చేశారని ప్రియాంక చెప్పుకొచ్చారు. ఎవరేమన్నారంటే... ఎన్నికల యాత్ర కాదు భారత్ జోడో యాత్ర ఎన్నికల్లో గెలుపు కోసం కాదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై దేశ ప్రజలనందరినీ ఒక్కటి చేయగలనని రాహుల్ పాదయాత్రతో నిరూపించారు – మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు లౌకిక పార్టీలన్నీ ఒక్కటవాలి బ్రిటిష్ పాలనపై ఐక్యంగా పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాం. అలాగే బీజేపీ పాలనపైనా పోరుకు లౌకిక శక్తులన్నీ కలిసి రావాలి. – డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి పశ్చిమం నుంచి తూర్పుకూ... శాంతి, సౌభ్రాతృత్వాలు కోరుకునే వారికి దేశంలో కొదవ లేదని జోడో యాత్ర నిరూపించింది. దక్షిణం నుంచి ఉత్తరానికి చేసినట్టుగానే దేశ పశ్చిమ కొస నుంచి తూర్పుకు కూడా రాహుల్ పాదయాత్ర చేయాలి. నేను ఆయన వెంట నడుస్తా. ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ రాహుల్ ఓ ఆశాకిరణం రాహుల్‌గాంధీలో దేశానికి ఒక నూతన ఆశా కిరణం దొరికింది. – మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధ్యక్షురాలు విభజన రాజకీయాలే ముప్పు విభజన రాజకీయాలు దేశానికెప్పుడూ హానికరమే. వాటిని వ్యతిరేకిస్తూ నా సోదరుడు చేసిన యాత్రకు జనం వస్తారో లేదోనని అని నేను మొదట్లో అనుకున్నా. కానీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఆద్యంతం వారు భారీగా తరలి వచ్చి సంఘీభావంగా నిలిచారు. ఐక్యతా స్ఫూర్తిని చాటారు. దేశమంతా యాత్రకు ఇంతగా మద్దతుగా నిలవడం నిజంగా గర్వకారణం. – ప్రియాంకా గాంధీ వద్రా చదవండి: కశ్మీర్ మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు.. వీడియో వైరల్.. -
Mrs Vishnoi: నాన్న కావాలని ఉందన్నారు.. కానీ తిరిగి రాలేదు.. అయినా
Swathi Vishnoi And Mayank Vishnoi Emotional Love Story: He Want To Be Dad But Never Came Back: అమృత తుల్యమైన ప్రేమను నిర్వచించడం ఎవరికీ సాధ్యం కాదు... నిజమైన ప్రేమలో ఆశించడాలు.. అనుమానాలు.. అవమానాలకు తావుండదు... అనుభూతులు మాత్రమే పదిలంగా మదిలో కొలువుంటాయి... మనస్ఫూర్తిగా ఇష్టపడిన వ్యక్తి భౌతికంగా వేల మైళ్ల దూరంలో ఉన్నా అనుక్షణం మన చెంతనే ఉన్నారన్న పవిత్ర భావన మనసును పులకింపజేస్తుంది.. తనతో పెనవేసుకున్న అనుబంధం అజరామరంగా నిలిచిపోతుంది.. శ్రీమతి విష్ణోయి ప్రస్తుతం ఇదే మానసిక స్థితిని అనుభవిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ మయాంక్ విష్ణోయి సతీమణి ఆమె. తన భర్త తనను గర్వపడేలా చేశారని, ఆయన లేరన్న విషయం తలచుకుని బాధపడటం తనకు ఏమాత్రం ఇష్టం లేదంటున్నారు. అత్తామామలకు తానే కొడుకుగా మారి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రాణంగా ప్రేమించే భర్త దూరమై రెండు నెలలు కావొస్తున్న వేళ ఆయనతో తన బంధాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన అందమైన జ్ఞాపకాలు పంచుకున్నారు. PC: Humans Of Bombay తొలి పిలుపే మిసెస్ విష్ణోయి అంటూ.. ‘‘నాలుగేళ్ల క్రితం.. సూర్యకిరణంలా నా జీవితంలో ప్రవేశించాడు మయాంక్. నా సహోద్యోగి కజిన్ ఆయన. తొలిసారి నన్ను చూసినపుడే... ‘‘నువ్వు ఏదో ఒకరోజు మిసెస్ విష్ణోయి అవుతావు’’! అన్నారు. నాకు నవ్వొచ్చింది. కానీ... మయాంక్ మాత్రం ఆ మాట సీరియస్‌గా తీసుకున్నారు. ఎప్పుడు కలిసినా శ్రీమతి విష్ణోయి అని పిలిచేవారు. ‘‘హే.. నువ్వు పిచ్చోడివి బాబూ’’ అని బదులిచ్చేదాన్ని. మెల్లగా మాటలు మొదలయ్యాయి. అర్ధరాత్రి వరకు ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. అప్పుడు ఇన్ఫాంట్రీలో మయాంక్ కెప్టెన్‌గా ఉండేవారు. డెహ్రాడూన్‌లో పోస్టింగ్. నేనేమో ఢిల్లీలో! ప్రతి శనివారం నన్ను చూసేందుకు 5 గంటల ప్రయాణం చేసేవారు. కానీ.. మేం కలిసి ఉండేది మాత్రం కేవలం రెండు గంటలే!! మయాంక్‌తో ఉంటే సమయమే తెలియదు! నా పుట్టినరోజైతే ఇక చెప్పనక్కర్లేదు. అకస్మాత్తుగా వచ్చి ఇప్పుడు మనం నేపాల్ వెళ్తున్నాం! మరోచోటుకు వెళ్తున్నాం అంటూ సర్ప్రైజ్ చేసేవారు. PC: Humans Of Bombay శ్రీమతి విష్ణోయి గారూ.. నన్ను పెళ్లి చేసుకుంటారా? ఒక్కోసారి అత్యంత శీతల ప్రదేశాల్లో తను విధులు నిర్వర్తించే వారు. అలాంటప్పుడు నెలల పాటు కనీసం నేరుగా చూసే వీలు కూడా ఉండేది కాదు. అలా ఓసారి రెండు నెలల ఎడబాటు. ఆ చేదు అనుభవాన్ని దూరం చేసేందుకు తన బర్త్‌డే రోజు తన దగ్గరికి వెళ్లి సర్ప్రైజ్ చేశాను. వెంటనే నన్ను ఆత్మీయంగా హత్తుకుని.. నువ్వు వచ్చావు కదా.. నా పుట్టినరోజు పరిపూర్ణమైంది అంటూ సంబరపడ్డారు. మరోసారి.. నన్ను నిజంగానే అమితాశ్చర్యాలకు గురిచేశారు. ఆరోజు నా పుట్టినరోజు. స్నేహితులు, బంధువుల ముందు మోకాళ్లపై కూర్చుని.. ‘‘శ్రీమతి విష్ణోయి గారూ.. నన్ను పెళ్లి చేసుకుంటారా?’’అంటూ ఎంతో గోముగా అడిగారు. అంతే ఇక! పెళ్లి భాజాలు మోగాయి! నాకింకా గుర్తు... పెళ్లిలో పూజారి మంత్రాలు చదువుతున్నపుడు.. మయాంక్ తనకు తానుగా కొన్ని ప్రమాణాలు చేశారు. ‘‘నాకు ఎల్లప్పుడూ నా దేశమే ప్రథమ ప్రాధాన్యం’’... ‘‘ఒకానొక రోజు నేను తిరిగి రానన్న వార్త వస్తుంది. సైనికుడి భార్యగా నువ్వు చేదు నిజాన్ని వినడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి’’ అని చెప్పారు. తనతో మాట్లాడుతూ సమయం గడపటం నాకెంతో ఇష్టం. PC: Humans Of Bombay నాన్నను కావాలని ఉందన్నారు.. కానీ పెళ్లైన కొత్తలో రోజులు ఎంతో మధురంగా గడిచాయి. ఆయనతో పాటు విధులు నిర్వర్తించే చోటుకు వెళ్లాను. అక్కడే మా పొదరింటిని నిర్మించుకున్నాం. అయితే, తను మేజర్ అయిన తర్వాతి ఏడాదికి కశ్మీర్‌లోని షోపియాన్‌లోని ఘర్షణాత్మక ప్రాంతంలో పోస్టింగ్ వచ్చింది. అక్కడ ప్రతిరోజూ కత్తిమీద సామే. కానీ మయాంక్ వీలు చిక్కినప్పుడల్లా... నన్ను చూడటానికి వచ్చేవారు. నాలుగేళ్ల బంధంలో తనతో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. చివరిసారిగా ఏప్రిల్‌లో ఆయన ఇంటికి వచ్చారు. వెళ్లేటపుడు.. ‘‘స్వా.. మన కుటుంబాన్ని పెంపు చేసుకోవాలని భావిస్తున్నా.. నాన్నను కావాలని ఉంది’’ అని ఆయన అన్న మాటలు ఇంకా గుర్తు. కానీ.. నా మయాంక్ తిరిగి రాలేదు.. తన గురించిన వార్త మాత్రం వచ్చింది. నా గుండె పగిలింది.. విశ్రాంతి తీసుకో రెండు నెలల క్రితం... నాకొక కాల్ వచ్చింది. ‘‘సర్... తలమీద ఎవరో గన్‌తో కాల్చారు’’.. అవతలి గొంతు. ఒక్కసారిగా నా ప్రపంచం కుప్పకూలింది. ఆరోజు ఉదయమే తనతో మాట్లాడాను. కానీ అంతలోనే ఇలా.. వెంటనే శ్రీనగర్‌కు బయల్దేరాను. తనను ఆ పరిస్థితిలో చూసి నా గుండె పగిలింది. బ్రెయిన్‌డెడ్ అని డాక్టర్లు చెప్పారు. అయినా.. తను నా మాటలు వింటున్నాడనే ఆశ.. 15 రోజుల పాటు నా మయాంక్ ఎంతో ధైర్యంగా మృత్యువుతో పోరాడాడు. ‘‘ఐ లవ్ యూ.. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను.. ఇక నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో మయాంక్’’తనతో నేను చెప్పిన చివరి మాటలు ఇవే. తనకు అంతిమ వీడ్కోలు పలికేందుకు బెటాలియన్ మొత్తం కదిలి వచ్చింది. సేన మెడల్‌తో తనను గౌరవించారు. రెండు నెలలు అవుతోంది. కానీ తను లేడన్న విషయం నమ్మలేకపోతున్నా. ఇంకా తను ఎక్కడో చోట డ్యూటీ చేస్తున్నాడనే భావనలో ఉంటా. నా జ్ఞాపకాల్లో తను సజీవం. నిద్రపోయే సమయంలో తన చేతి గడియారం పెట్టుకుంటాను. తన దుస్తులు ధరిస్తాను.. తను నన్ను గట్టిగా హత్తుకున్నట్లుగా అనిపిస్తుంది. తను నాతోనే ఉన్నాడు.. ఉంటాడు... కానీ నా భర్త లేడని నేను ఎన్నడూ శోకించను.. అందుకు బదులుగా తను నాకు మిగిల్చిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ... ఒక వ్యక్తిగా... దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడిగా తను నాకు నేర్పించిన విలువలు తలచుకుంటూ కాలం గడిపేస్తా’’ అని ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించారు. అన్నట్లు మిసెస్ విష్ణోయి పేరు చెప్పలేదు కదూ! స్వాతి మయాంక్ విష్ణోయి! ప్రేమకు నిలువెత్తు రూపమైన భర్త జ్ఞాపకాల్లో సంతోషం వెదుక్కుంటున్న ‘మయాంక్ జీవిత భాగస్వామి’! ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జమ్మూ కశ్మీర్లో చేపట్టిన ఆపరేషన్‌లో ఆగష్టు 27న గాయపడ్డ మయాంక్ విష్ణోయి పదిహేను రోజుల తర్వాత శాశ్వతంగా ఈ లోకాన్ని వీడివెళ్లిపోయారు. -సాక్షి వెబ్‌డెస్క్ -
బేరమాడి చెప్పులు కొన్న సోనూసూద్.. వీడియో వైరల్
రియల్ హీరో సోనూసూద్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికి తెలిసిందే. సామాజిక మాధ్యమాలను కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా.. సేవా కార్యక్రమాలను వినియోగిస్తుంటాడు. కరోనా లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల సాయం చేసిన ఈ రియల్ హీరో.. ఇటీవల వీధి వ్యాపారులకు అండగా నిలుస్తున్నాడు. తాజాగా వీధి వ్యాపారి దగ్గర చెప్పులు కొన్న ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇటీవల సోనూసూద్ సినిమా షూటింగ్ నిమిత్తం జమ్మూ-కశ్మీర్ వెళ్లాడు. అక్కడి మార్కెట్లో తిరుగుతూ సందడి చేశాడు. షమీమ్‌ఖాన్ అనే వీధి వ్యాపారి దగ్గరికి వెళ్లి చెప్పుల ధరను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా తనకి కొంత డిస్కౌంట్ ఇవ్వమని అడిగాడు. ‘ఎంత డిస్కౌంట్ ఇస్తావు నాకు’ అని సోనూ అడిగిన ప్రశ్నకు షమీమ్ ‘20 శాతం’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ‘చెప్పులు కొనాలనుకుంటున్న వారు షమీమ్ షాపును సందర్శించండి. నా పేరు చెప్పి డిస్కౌంట్ కూడా పొందండి’ అంటూ ఓ వీడియోను తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీధి వ్యాపారిని సపోర్ట్ చేస్తూ సోను చేసిన పనికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోనూసూద్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
పుల్వామాలో ఎన్కౌంటర్; లష్కరే కమాండర్ హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా టౌన్లో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా కమాండర్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బుధవారం తెల్లవారుజామున కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ఈ సందర్భంగా వారిని లొంగిపోవాలని కోరామని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నారు. వారిలో లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ ఉన్నాడని తెలిపారు. మరో ఇద్దరు స్థానికులని, వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి ఉందని వెల్లడించారు. -
రెచ్చిపోయిన ఉగ్రవాది.. నడి రోడ్డుపై కాల్పులు
-
రెచ్చిపోయిన ఉగ్రవాది.. నడి రోడ్డుపై కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పట్టపగలు, నడి రోడ్డుపై కాల్పులకు తెగ బడ్డారు. దుకాణం వద్ద నిలబడి ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులకు తెగ బడ్డాడు ఓ ఉగ్రవాది. శ్రీనగర్ భగత్ బర్జుల్లా ప్రాంతంలో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన కానిస్టేబుల్స్ సోహైల్ అహ్మద్, మహ్మద్ యూసుఫ్ బర్జుల్లాలోని ఓ టీ స్టాల్ వద్ద నిల్చుని ఉన్నారు. ఇంతలో నడుచుకుంటూ వచ్చిన ఓ ఉగ్రవాది తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీతో కాల్పులకు తెగ బడ్డాడు. ఊహించని ఈ ఘటనకు చుట్టు పక్కల ఉన్న స్థానికులు త్రీవ భయందోళనకు గురయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాది అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటన గురించి తెలిసి ఆర్మీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్స్ సోహైల్ అహ్మద్, మహ్మద్ యూసుఫ్‌లు మరణించారు. అక్కడే ఉన్న సీసీకెమరాలో ఉగ్రవాది దాడి చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. శ్రీనగర్‌లో మూడు రోజుల వ్యవధిలో ఉగ్రవాదులు ఇలా బరి తెగించడం ఇది రెండో సారి. నగరంలోని హై సెక్యూరిటీ దుర్గానాగ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ యజమాని కొడుకుపై మూడు రోజుల క్రితం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. చదవండి: అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ -
శ్రీనగర్‌లో ఎన్కౌంటర్; ఉగ్రవాది హతం
శ్రీ నగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్‌లోని నవకాడల్ ఏరియాలో హిజ్బుల్ మొజాహిద్దీన్ ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు సోమవారం రాత్రి స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కాగా మంగళవారం తెల్లవారుజామున నవకాడల్ ఏరియాలో ఉగ్రవాదులు దాగి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో జవాన్లు ఎదురుకాల్సులకు దిగారు. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఒక ఉగ్రవాది హతమయ్యాడని, ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. -
మోదీ సర్కారు దేనిని దాచేందుకు ప్రయత్నిస్తోంది?
శ్రీనగర్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్షాల నేతలను జమ్మూ కశ్మీర్ అధికారులు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. అనంతరం వీరిని వెనక్కి పంపించినట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోయలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కశ్మీర్లో ప్రశాంత వాతావరణం ఉందని, కావాలనుకుంటే ఇక్కడ పర్యటించవచ్చునని విపక్షాలకు సూచించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సహా ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన పలువురు నేతలు శనివారం కశ్మీర్ పర్యటనకు బయల్దేరారు. అయితే వీరంతా అక్కడ పర్యటించేందుకు కశ్మీర్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అంతేగాక జాతీయ నేతలు పర్యటించాలనుకున్న ప్రాంతాల్లో ముందుగానే 144 సెక్షన్‌ను అమలు చేశారు. అనుమతి లేనప్పటికీ విపక్ష నేతల బృందం ఢిల్లీ నుంచి శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని అడ్డగించిన అధికారులు తిరిగి పంపించివేశారు. కాగా ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించింది. ఈ మేరకు...‘ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా జమ్మూ కశ్మీర్లో పరిస్థితి సాధారణంగానే ఉంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో అక్కడికి వెళ్లిన విపక్ష నేతల బృందాన్ని శ్రీనగర్ ఎయిర్‌పోర్టు నుంచే ఎందుకు వెనక్కి పంపారు. మోదీ ప్రభుత్వం ఏ విషయాన్ని దాయడానికి ఇంతలా ప్రయత్నిస్తోంది’ అని అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రశ్నించింది. If the situation in Jammu & Kashmir is "normal" as the govt claims, why has the delegation of Opposition leaders led by Shri @RahulGandhi been sent back from Srinagar airport? What is the Modi govt trying to hide? #RahulGandhiWithJnK — Congress (@INCIndia) August 24, 2019 ఇక విపక్ష నేతల పర్యటనపై అధికార బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్లో అల్లర్లు సృష్టించడానికే నేతలు అక్కడ పర్యటిస్తున్నారని విమర్శిస్తోంది. కాగా జాతీయ నేతల పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. లోయలో శాంతి, భద్రతల పునరుద్ధరణ కొనసాగుతున్న వేళ తమ పర్యటనను రద్దు చేసుకోవాలని కోరింది. కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో ఇంకా నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయి కాబట్టి తాజా పర్యటన.. నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని ప్రకటించింది. శాంతి, భద్రతల పునరుద్ధరణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యటనను రద్దు చేసుకోవాలని కశ్మీర్ పాలనా అధికారులు వీరిని కోరారు. -
శ్రీనగర్ హోటల్ ఔదార్యం
శ్రీనగర్ : భారత, పాకిస్థాన్ దేశాల మధ్యయుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో శ్రీనగర్ సహా మరికొన్ని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. దీంతోపాటు శ్రీ నగర్-జమ్మూ జాతీయ రహదారిని కూడా మూసివేశారు. దీంతో పలువిమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న దేశీయ ప్రయాణికులు, టూరిస్టులను ఆదుకునేందుకు శ్రీనగర్‌లోని ఒక హోటల్ ముందుకు వచ్చింది. శ్రీనగర్ నగరం నడిబొడ్డున జవహర్ నగర్లో ఉన్న హోటల్ ది కైసార్ తన ఔదార్యాన్ని ప్రదరశించింది. కశ్మీర్ లోయను సందర్శించడానికి వచ్చి ఇబ్బందుల్లో చిక్కుకున్న దేశీయ టూరిస్టులకు ఉచిత వసతి. భోజన సదుపాయాలను కల్పిస్తున్నట్టు ప్రకటించింది. పరిస్థితి మెరుగుపడేంతవరకు ఈ అవకాశాన్ని అందిస్తామని వెల్లడించింది. శ్రీనగర్‌లో చిక్కుకున్న పర్యాటకులు హోటల్ నంబర్ 9999059079, 9868270376 లలో సంప్రదించవచ్చని :ఫేస్బుక్ ద్వారా తెలిపింది. కాశ్మీర్లో ఉన్న పరిస్థితులను బట్టి, పర్యాటకులకు ఉచిత వసతి , ఆహారాన్ని అందిస్తున్నామని హోటల్ ఛైర్మన్ షేక్ బషీర్ అహ్మద్ చెప్పారు. మరోవైపు 9 విమానాశ్రయాల్లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్టు డీజీసీఏ ప్రకటించింది. జమ్ము, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్టాల్లోని విమాన సర్వీసులను పునరుద్ధరించినట్టు డీజీసీఏ అధికారి తెలిపారు. కాగా బుధవారం ఉదయం కాశ్మీర్ బుద్గం జిల్లాలో భారతీయ వైమానిక దళానికి చెందిన జెట్ కూలిపోయింది. దీంతో శ్రీనగర్ సహా జమ్ము, షిమ్లా, కాంగ్రా, కులుమనాలి, పిత్తోడ్‌గఢ్, అమృత్సర్, డెహ్రాడూన్, చండీగఢ్, పఠాన్‌కోట్, విమానాశ్రాయాల వద్ద ఫిబ్రవరి 27నుంచి మే 27వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిని సంగతి తెలిసిందే. For any one stuck in Srinagar & running low on funds please fell free to take up this offer. pic.twitter.com/nMQYrzJQxi — Omar Abdullah (@OmarAbdullah) February 27, 2019 -
చిన్నారి పాప.. ఎందుకీ శిక్ష?
‘ఆమె చేసిన తప్పేంటి? లోకం తెలియని పసిపాప. ఆమెకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. నేను దేవుడిని కోరేది ఒక్కటే. దీనంతకీ కారణమైన వారిని కఠిన శిక్ష పడాలి’ ఓ తల్లి ఆవేదన ఇది. తన 20 నెలల కుమార్తె హిబా నిసార్ కంటిపాపను చిదిమేసిన వారిపై మార్సలా జాన్ వ్యక్తం చేసిన ఆక్రందన అందరినీ కదిలిస్తోంది. జమ్మూకశ్మీర్ శ్రీనగర్‌లోని శ్రీ మహరాజ హరిసింగ్ (ఎస్ఎంహచ్ఎస్) ఆస్పత్రి ఆప్తమాలజీ విభాగంలో నాలుగో నంబరు మంచంపై హిబా నిసార్ ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. ఏడుపు మాన్పించేందుకు ఆమె తల్లిదండ్రులు చాకెట్లు, స్వీట్లు ఇచ్చి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కంటి గాయం బాధను తట్టుకోలేక చిన్నారి రోదిస్తూనే ఉంది. షొపియాన్లో ఆదివారం జరిగిన ఘటనలో ఆమె కుడి కంటికి గాయమైంది. ఇంట్లో ఆడుకుంటున్న హిబా కంట్లోకి పెల్లెట్ దూసుకొచ్చింది. తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శత్రచికిత్స చేసి పెల్లెట్‌ను తొలగించారు. అయితే పరిస్థితి విషమంగానే ఉందని, ఆమె కుడి కంటిచూపు పోయే ప్రమాదముందని డాక్టర్లు చెప్పడంతో హిబా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏం జరిగింది? షోపియాన్‌లో ఆదివారం తెల్లవారుజామున అల్లర్లు చెలరేగడంతో భద్రతా దళాలు, అల్లరి మూకలకు మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఈ ఘటనలో పౌరుడొకరు ప్రాణాలు కోల్పోగా, 50 మందిపైగా గాయపడ్డారు. ఇదే గొడవలు హిబా కంటి గాయానికి కారణమయ్యారు. తమ ఇంటి దీపం హిబాకు గాయమైన క్రమాన్ని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో ఆమె తల్లి జాన్ వివరించారు. ‘మేము ఇంట్లో ఉండగా బయట టియర్ గ్యాస్ కాల్పులు కొనసాగాయి. బయటంతా పొగ కమ్మేయడంతో ఐదేళ్ల నా కుమారుడు శ్వాస పీల్చుకుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో నా పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోవాలని అనుకున్నాను. వెంటనే తలుపులు తీశాను. ముగ్గురు వ్యక్తులు(భద్రతా సిబ్బంది) నేరుగా మాపైకి పెల్లెట్లను ప్రయోగించార’ని వెల్లడించారు. హిబా కుటుంబం షొపియాన్ జిల్లా బాత్గండ్ ప్రాంతంలోని కాప్రిన్ గ్రామంలో నివసిస్తోంది. ఆదివారం ఇక్కడే అల్లర్లు జరిగాయి. వైద్యుల సలహా మేరకు హిబాను షొపియాన్ నుంచి శ్రీనగర్‌కు తీసుకెళ్లారు. కొడుకు ఎలా ఉన్నాడో? తన పిల్లలను కాపాడుకునే క్రమంలో తన చేతికి కూడా గాయమైందని మార్సలా జాన్ తెలిపారు. హిబాను రక్షించేందుకు తన చేతిని ఆమె ముఖానికి అడ్డుగా పెట్టానని చెప్పారు. తన చేతి పక్క నుంచి పెల్లెట్ హిబా కంట్లోకి దూసుకుపోయిందన్నారు. తమ కొడుకు గురించి కూడా జాన్, ఆమె భర్త నిసార్ అహ్మద్ ఆందోళన చెందుతున్నారు. తన కుమారుడి దేహంలోకి పెల్లెట్లు దూసుకెళ్లాయేమో చూడాలని షొపియాన్లోని తన బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. పెల్లెట్ల బారి నుంచి కాపాడేందుకు తన కుమారుడిని మరోవైపుకు తోసేసినట్టు వెల్లడించారు. తమ పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని దీనంగా చెప్పారు. హిబా ఆరోగ్య పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని ఎస్ఎంహచ్ఎస్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ‘ఆమె పరిస్థితి బాలేదు. చేతి వేళ్లు చూపించి చికిత్సకు చిన్నారి ఏవిధంగా స్పందిస్తుందో పరీక్షిస్తున్నాం. పెల్లెట్ కారణంగా కంటిలోని కార్నియా దెబ్బతింద’ని ఆప్తమాలజీ విభాగం డాక్టర్ ఒకరు వెల్లడించారు. చిన్నారి హిబా పడుతున్న యాతన ఆస్పత్రి సిబ్బందితో పాటు అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆమె కంటిచూపు కలకాలం ఉండాలని అందరూ ప్రార్థిస్తున్నారు. -
కాశ్మీర్ లో జలప్రళయం
-
జవాన్.. మీ సేవలు మరువలేనివి!
-
శ్రీనగర్ చేరుకున్న నరేంద్ర మోడీ
-
మూగపోయిన ల్యాండ్ఫోన్లు
మానవపాడు, మండల పరిధిలోని శ్రీనగర్ గ్రామంలో 60 ల్యాండ్ఫోన్లు మూగబోయాయి. రాజోలి గ్రామం నుండి అలంపూర్ పట్టణంకు తాగునీటి కొరకు వేస్తున్న వాటర్పైప్లైన్ పనులవారు బీఎస్ఎన్ఎల్ కేబుల్‌ను పెకిలించడంతో అన్నివైర్లు పూర్తిగా పాడయ్యాయి. దీంతో మంగళవారం నుండి ఫోన్లు పనిచేయడం లేదు. మరమత్తులు చేయాలంటే సుమారు 2లక్షల రూపాయలు కావాలని బీఎస్ఎన్ఎల్ యాజమాన్యం తెలిపింది. ఈ డబ్బులు ఎవరు ఇస్తారో... మరమత్తులు ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. రెండురోజుల నుండి ఒక్కఫోన్ పనిచేయడం లేదని, పైప్‌లైన్ వేసేవారిపై చర్యలు తీసుకొవాలని కోరారు. అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు త్రవ్వకాలు జరిపి కేబుళ్లను పాడుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదును పరిశీలిస్తామని ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు.