మండల పరిధిలోని శ్రీనగర్ గ్రామంలో 60 ల్యాండ్‌ఫోన్లు మూగబోయాయి.
మానవపాడు, మండల పరిధిలోని శ్రీనగర్ గ్రామంలో 60 ల్యాండ్‌ఫోన్లు మూగబోయాయి. రాజోలి గ్రామం నుండి అలంపూర్ పట్టణంకు తాగునీటి కొరకు వేస్తున్న వాటర్‌పైప్‌లైన్ పనులవారు బీఎస్‌ఎన్‌ఎల్ కేబుల్‌ను పెకిలించడంతో అన్నివైర్లు పూర్తిగా పాడయ్యాయి.
దీంతో మంగళవారం నుండి ఫోన్లు పనిచేయడం లేదు. మరమత్తులు చేయాలంటే సుమారు 2లక్షల రూపాయలు కావాలని బీఎస్‌ఎన్‌ఎల్ యాజమాన్యం తెలిపింది. ఈ డబ్బులు ఎవరు ఇస్తారో... మరమత్తులు ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. రెండురోజుల నుండి ఒక్కఫోన్ పనిచేయడం లేదని, పైప్‌లైన్ వేసేవారిపై చర్యలు తీసుకొవాలని కోరారు.
అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు త్రవ్వకాలు జరిపి కేబుళ్లను పాడుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదును పరిశీలిస్తామని ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు.