
రియల్ హీరో సోనూసూద్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికి తెలిసిందే. సామాజిక మాధ్యమాలను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కాకుండా.. సేవా కార్యక్రమాలను వినియోగిస్తుంటాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల సాయం చేసిన ఈ రియల్ హీరో.. ఇటీవల వీధి వ్యాపారులకు అండగా నిలుస్తున్నాడు. తాజాగా వీధి వ్యాపారి దగ్గర చెప్పులు కొన్న ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది.
ఇటీవల సోనూసూద్ సినిమా షూటింగ్ నిమిత్తం జమ్మూ-కశ్మీర్ వెళ్లాడు. అక్కడి మార్కెట్లో తిరుగుతూ సందడి చేశాడు. షమీమ్‌ఖాన్ అనే వీధి వ్యాపారి దగ్గరికి వెళ్లి చెప్పుల ధరను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా తనకి కొంత డిస్కౌంట్ ఇవ్వమని అడిగాడు. ‘ఎంత డిస్కౌంట్ ఇస్తావు నాకు’ అని సోనూ అడిగిన ప్రశ్నకు షమీమ్ ‘20 శాతం’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ‘చెప్పులు కొనాలనుకుంటున్న వారు షమీమ్ షాపును సందర్శించండి. నా పేరు చెప్పి డిస్కౌంట్ కూడా పొందండి’ అంటూ ఓ వీడియోను తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీధి వ్యాపారిని సపోర్ట్ చేస్తూ సోను చేసిన పనికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోనూసూద్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment