
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ దివాలా తీసిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం చర్ల మండలంలోని కుదునూరులో ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి మోసం చేశారని ఆరోపించారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఆర్టీసీలో 48 వేల ఉద్యోగాలు తొలగించేందుకు మొండిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీలో దళిత, గిరిజనుల సాగులో ఉన్న భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. దొరల తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భద్రాచంల ఎమ్మెల్యే పోడెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment