సాక్షి, హైదరాబాద్: నూతన ప్రాజెక్టులన్నీ తానే డిజైన్ చేస్తున్నానని చెబుతున్న సీఎం కేసీఆర్‌కు టెక్నికల్ నాలెడ్జ్ ఉందా అంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల మీద రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు చేయడాన్ని దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. దీనిపై ప్రభుత్వం సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇప్పటివరకు ప్రాజెక్టుల మీద లక్ష కోట్ల వరకు ఖర్చు చేశామని ప్రభుత్వం బెబుతుంది.. కానీ ఒక్క ఎకరానికయినా నీళ్లు వచ్చాయా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చేసిన ఖర్చు పనిలో కనపడాలి కదా అని విమర్శించారు. ప్రాజెక్టులపై చేసిన ఖర్చుపై అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. భూప్రక్షాళన మీద ఎలాంటి ప్రక్షాళన జరగలేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. భూ ప్రక్షాళన పేరు మీద కొత్త సమస్యలు వచ్చాయని భట్టి విక్రమార్క అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment