సీఎం కార్యాలయం వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు
‘సీఎంపై కేసు నమోదు చేయాలి’
Published Fri, Jul 14 2017 4:05 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM
హైదరాబాద్: సీఎం కార్యాలయం వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు ఆత్మహత్యకు యత్నించిన విషయం విదితమే.
సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వారు ప్రయత్నించి నిరాశతో బలవన్మరణానికి యత్నించారని, ఇందుకు కారణమైన ముఖ్యమంత్రిపై సెక‌్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని వీహెచ్ శుక‍్రవారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement