![Hanmantha Rao about congress Manifesto - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/27/vh.jpg.webp?itok=QHOBsxLc)
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మేనిఫెస్టోలో మున్నూరు కాపుల కార్పొరేషన్ ఏర్పాటును చేర్చాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు హన్మంతరావు టీపీసీసీకి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. రెడ్లు, ఆర్యవైశ్యుల లాగే మున్నూరు కాపుల్లో కూడా ఆర్థికంగా వెనుక బడినవారు ఉన్నారని, మొత్తం జనాభాలో వీరు 30 శాతం ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment