హైదరాబాద్ : గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి భజనచేస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో హత్యలు, అశాంతి పెరిగిపోయాయన్నారు. దేశంలోనే హత్యల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రెండు రోజుల్లోనే 7 హత్యలు జరిగాయన్నారు.
నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హత్యల్లో,అరాచకాల్లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నారని విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడంలో
ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలపై కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు లేఖ రాస్తానని తెలిపారు.
గవర్నర్ ప్రభుత్వానికి భజన చేస్తున్నాడు: వీహెచ్
Published Wed, Jan 31 2018 4:27 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment