
సాక్షి, హైదరాబాద్: ఎన్ని కల్లో పొత్తులు పెట్టుకుం టే తప్పేంటని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హను మంతరావు టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడు తూ ‘మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు తప్పు లేదు కానీ మేము పెట్టుకుంటే తప్పా’ అని ప్రశ్నించా రు.
ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్ నేతలు అవా కులుచెవాకులు మాట్లాడుతున్నారని దుయ్యబ ట్టారు. టీఆర్‌ఎస్ నాలుగేళ్ల పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేసీ ఆర్ వైఫల్యాలపై ఊరూరా ప్రచారం చేసి ప్రజా తీర్పు కోరుతామన్నారు. ప్రజల దీవెనల కోసం ప్రజాసంకల్ప యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి ఇందిరమ్మ రథం ప్రారంభిం చనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment