కేసులు పెట్టి అరెస్టు చేయిస్తానన్న సీఎం కేసీఆర్ దమ్ముంటే ముందు తనను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత్‌రావు(వీహెచ్) సవాల్ విసిరారు.
నిజామాబాద్ సిటీ: కేసులు పెట్టి అరెస్టు చేయిస్తానన్న సీఎం కేసీఆర్ దమ్ముంటే ముందు తనను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత్‌రావు(వీహెచ్) సవాల్ విసిరారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ పని ఖతం అయిపోయిందని కేసీఆర్ అంటున్నారని, రాబోయే రెండు సంవత్సరాలలో టీఆర్‌ఎస్ పనే ఖతం కాబోతోందన్నారు. ఏ పార్టీలకైనా ఒడిదుడుకులు సహజమని కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ బెదిరింపులకు ఏ నాయకుడు భయపడవద్దని ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు.