సాక్షి, హైదరాబాద్ : సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు కంటతడి పెట్టుకున్నారు. తనపై అసత్య వార్తలు రాస్తున్నారంటూ వాపోయారు. శుక్రవారం మీడియాతో మట్లాడిన ఆయన గ్రేటర్ నేతలు ఏడుగురిని విమర్శిస్తు కరపత్రాలు ప్రచురిస్తే.. దానిపై న్యూస్ పేపర్లలో వార్తలు రాయడం అనైతికం అంటూ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకొని తనపై అసత్య వార్తలు రాస్తున్నారంటూ కంటతడి పెట్టుకున్నారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశానని, తనపై వార్తలు రాసేముందు ఒకసారి నిజమేంటో తెలసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.
అనుక్షణం పార్టీ కోసం పని చేసే వ్యక్తి తానని, తన రాజీకీయ జీవితంలో ఎంతో మంది లీడర్లను తయారు చేశానంటూ వీహెచ్ చెప్పుకొచ్చారు. అలాంటి తనను బీసీలకు వ్యతరేకమంటూ విమర్శలు చేస్తున్నారని, తనని డ్యామేజీ చేస్తే ఏం వస్తుందంటూ ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలే ఒకరిపై మరొకరు కరపత్రాలు ప్రచురించడం పార్టీకే నష్టం అంటూ హెచ్చరించారు. ఈ కరపత్రాలపై వార్తలు రాసిన వారిపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ నేతలపై వార్తలు రాసే మీడియా.. కేసీఆర్ ఇంటి గొడవలపై ఎందుకు వార్తలు రాయరు అంటూ నిలదీశారు. తనపై తప్పుడు కరపత్రాలు ప్రచురించిన వారిపై పరువునష్టం దావా వేస్తానని వీహెచ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment