Emotional upset
-
Ford: ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు!
'Please don't leave': ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ సంస్థ ఇండియాలో తమ ఆపరేషన్స్ నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో అనేక మంది ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఫోర్డ్ డోంట్ గో అంటూ సోషల్ మీడియాలో ఫోర్డ్‌తో తమకున్న ఎమోషనల్ బాండింగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. సెప్టెంబరు 9న ఫోర్డ్ నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి ఫోర్డ్ ఇండియా హ్యాష్‌ట్యాగ్ ట్రెండవుతోంది. - మెయినుద్దీన్ షేక్ అనే వ్యక్తి స్పందిస్తూ ఫోర్డ్ అస్పైర్ కారు కొనుక్కోవడం తన లక్క్ష్యమని, దానికి సంబంధించిన డబ్బును కూడబెట్టానని, ఈ ఏడాది చివరికల్లా కొనుక్కుందామని ప్లాన్ చేశానని పేర్కొన్నాడు. ఫోర్డ్ తాజా నిర్ణయంతో తన హృదయం ముక్కలైందని, ఫోర్డ్ ప్లీజ్ డోంట్ గో అంటూ కోరాడు No more EcoSport and Endeavour #FordIndia pic.twitter.com/gWRGunXA19 — Car Stuff (@carrelatedstuff) September 9, 2021 - భార్గవ్ పెదకొలిమి అనే ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ... 12 ఏళ్ల నుంచి ఫోర్డ్ కారు కొనుక్కోవాలనేది తన కలని, ఇప్పుడు ఆ కల తీరే సమయం వచ్చినప్పుడే ఫోర్డ్ ఇండియాను వీడి వెళ్లిపోతుందని తెలిసి హార్ట్‌బ్రేక్ అయ్యిందటూ పేర్కొన్నాడు. క్వాలిటీ, కంఫర్ట్, పవర్ఫుల్ ఇంజన్ అందివ్వడంలో ఫోర్ట్ మేటి అని చెబతూ.. ఇండియాను వదిలి వెళ్లొద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. - నాకు ఆరేడేళ్ల వయసు నుంచి ఫోర్డ్ కారు సొంతం చేసుకోవాలనే కల ఉండేదని, ఇప్పుడు ఫోర్డ్ ఇండియాను వీడి వెలుతుందనే వార్తలతో నా కల చెదిరిపోయిందంటూ సిద్ధార్థ్ నౌతియాల్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. I'm at a loss of words. I dreamt of owning a Ford since I was 6 or maybe 7 years old. A childhood dream just got crushed. I wish you had updated your budget vehicles (Figo/Freestyle/Aspire). They were enthusiast's choice and had so much potential. 😢 — Siddharth Nautiyal (@1998_Siddharth_) September 9, 2021 నాట్ లీవింగ్ ఇండియా ఇండియాను వీడి పోతున్నట్టు ప్రకటించగానే నెటిజన్ల నుంచి వెల్లువెత్తున్న ఎమోషనల్ ట్వీట్స్‌కి ఫోర్డ్ ఇండియా స్పందించింది. ఇండియాను తాము వీడి వెళ్లడం లేదంటూ లైట్ బిజినెస్ మోడల్ని అప్లై చేయబోతున్నట్టు తెలుపుతోంది. దీని వల్ల లాంగ్ రన్లో సంస్థకు లాభాలు వస్తాయంటూ వివరణ ఇస్తోంది. Hello, Kunal: Ford is NOT leaving India. A new, asset-light business model is being created with the reforms we announced today. This business model will be more profitable in the long run. ^VG — Ford India Service (@FordIndiaHelp) September 9, 2021 -
కరోనా మరణాలపై ప్రధాని కన్నీటి పర్యంతం
-
Narendra Modi: కరోనా మరణాలపై ప్రధాని కన్నీటి పర్యంతం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్నీటి పర్యంతమయ్యారు. పెద్ద ఎత్తున ప్రజలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. దేశంలో కరోనా పరిస్థితులపై శుక్రవారం ప్రధాని మోదీ ఆరోగ్య కార్యకర్తలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ క్రమంలో వైరస్‌తో ప్రజలు మృతి చెందుతుండడాన్ని గుర్తు చేసుకుని ఆవేదన చెందారు. తన సొంత లోక్‌సభ నియోజకవర్గం వారణాసికి చెందిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వైరస్ ఎంతోమంది ప్రియమైన వారిని మన నుంచి తీసుకెళ్లింది అని తెలిపారు. వారందరికీ అంజలి ఘటిస్తున్నట్లు చెప్పారు. కరోనాతో మృతి చెందిన కుటుంబసభ్యులకు వినమ్రపూర్వక శ్రద్ధాంజలి అర్పిస్తున్నట్లు రెండు చేతులు జోడించి తెలిపారు. బ్లాక్ ఫంగస్ కొత్త ఛాలెంజ్ అని, దానికి సర్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పరిశుభ్రత పాటించాలని, కాశీని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాశీకి, అక్కడి ప్రజలందరికీ కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ముఖ్యంగా వైద్యులు, వైద్య సిబ్బంది మొదలుకుని అంబులెన్స్ డ్రైవర్ల అందరికీ అభినందనలు తెలిపారు. -
కంటతడి పెట్టిన వీహెచ్
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు కంటతడి పెట్టుకున్నారు. తనపై అసత్య వార్తలు రాస్తున్నారంటూ వాపోయారు. శుక్రవారం మీడియాతో మట్లాడిన ఆయన గ్రేటర్ నేతలు ఏడుగురిని విమర్శిస్తు కరపత్రాలు ప్రచురిస్తే.. దానిపై న్యూస్ పేపర్లలో వార్తలు రాయడం అనైతికం అంటూ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకొని తనపై అసత్య వార్తలు రాస్తున్నారంటూ కంటతడి పెట్టుకున్నారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశానని, తనపై వార్తలు రాసేముందు ఒకసారి నిజమేంటో తెలసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. అనుక్షణం పార్టీ కోసం పని చేసే వ్యక్తి తానని, తన రాజీకీయ జీవితంలో ఎంతో మంది లీడర్లను తయారు చేశానంటూ వీహెచ్ చెప్పుకొచ్చారు. అలాంటి తనను బీసీలకు వ్యతరేకమంటూ విమర్శలు చేస్తున్నారని, తనని డ్యామేజీ చేస్తే ఏం వస్తుందంటూ ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలే ఒకరిపై మరొకరు కరపత్రాలు ప్రచురించడం పార్టీకే నష్టం అంటూ హెచ్చరించారు. ఈ కరపత్రాలపై వార్తలు రాసిన వారిపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ నేతలపై వార్తలు రాసే మీడియా.. కేసీఆర్ ఇంటి గొడవలపై ఎందుకు వార్తలు రాయరు అంటూ నిలదీశారు. తనపై తప్పుడు కరపత్రాలు ప్రచురించిన వారిపై పరువునష్టం దావా వేస్తానని వీహెచ్ అన్నారు. -
దీని విలువేంటో మీకు తెలీదు.. ఐష్ కంటతడి
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ భావోద్వేగానికి గురయ్యారు. కొందరు ఫోటోగ్రాఫర్లు చేసిన పనికి ఆమె మనస్థాపం చెంది స్టేజీపైనే కంటతడి పెట్టుకున్నారు. చనిపోయిన తన తండ్రి కృష్ణరాజ్ రాయ్ పుట్టిన రోజు వేడుకలను ఓ స్వచ్ఛంద సంస్థ తరపున నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సోమవారం ఆమె స్మైల్ ఫౌండేషన్ తరపున షుష్రుషా ఆస్పత్రిలో ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి ఐశ్వర్య తల్లి బృంద, కూతురు ఆరాధ్య కూడా హాజరయ్యారు. అయితే పిల్లలతో కలిసి ఈవెంట్ నిర్వహిస్తున్న సమయంలో కొంత మంది ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్లు పదే పదే ఫోటోలు తీస్తూ.. అరుస్తూ కనిపించటంతో ఆమె అసహనానికి లోనయ్యారు. ‘‘దయచేసి ఆపండి. ఇదేం పబ్లిక్ ఈవెంట్, సినిమా వేడుకో కాదు. చనిపోయిన వ్యక్తి గౌరవార్థం చేస్తున్న పని. దీని విలువ మీకు తెలీదు. ’’ అంటూ కంటతడి పెట్టడం ప్రారంభించారు. ఇక ఆ ఫోటోగ్రాఫర్లు ఆ మూమెంట్‌ను కూడా క్లిక్ మనిపించటం విశేషం. కాగా, అంతకు ముందు రోజు ఆరాధ్య పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించగా.. పలువురు బాలీవుడ్ తారలు సందడి చేసిన విషయం తెలిసిందే. అన్నింట్లో కన్నా షారూఖ్ చిన్న కొడుకు అబ్రామ్తో అమితాబ్ చేసిన సందడే హైలెట్‌గా నిలిచింది. T 2716 - And as for this little bundle .. he wanted the fluffy 'buddhi ka baal' cone .. so we took him to the stall made one for him and the joy of getting it is just priceless .. Abram, jr Shahrukh .. delectable !! pic.twitter.com/8SMF9YsH7p — Amitabh Bachchan (@SrBachchan) 19 November 2017 -
సిక్త్స్ సెన్స్ కాపాడుతుంది!
న్యూయార్క్: మానసిక కలతతో, పరధ్యానంతో డ్రైవింగ్ చేస్తున్నపుడు మన సిక్త్స్ సెన్స్ మనల్ని కాపాడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఫోన్లో మెసెజ్‌లు చేస్తూ వాహనాలను నడుపుతున్న సమయం లో కాకుండా మిగతా అన్ని సమయాల్లో సిక్త్స్ సెన్స్ సక్రమంగా పయనించేలా చేస్తుం దని తేలింది. ఈ మేరకు 59 మందిపై అమెరికా హూస్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు సర్వే నిర్వహిం చారు. సాధారణ స్థితిలో, పరధ్యానంలో, భావోద్వేగంలో, ఫోన్లో మెసేజ్ పంపుతున్నపుడు ఇలా 4 స్థితుల్లో డ్రైవింగ్ చేయించారు.