సాక్షి, న్యూఢిల్లీ: కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్నీటి పర్యంతమయ్యారు. పెద్ద ఎత్తున ప్రజలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. దేశంలో కరోనా పరిస్థితులపై శుక్రవారం ప్రధాని మోదీ ఆరోగ్య కార్యకర్తలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ క్రమంలో వైరస్‌తో ప్రజలు మృతి చెందుతుండడాన్ని గుర్తు చేసుకుని ఆవేదన చెందారు.
తన సొంత లోక్‌సభ నియోజకవర్గం వారణాసికి చెందిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వైరస్ ఎంతోమంది ప్రియమైన వారిని మన నుంచి తీసుకెళ్లింది అని తెలిపారు. వారందరికీ అంజలి ఘటిస్తున్నట్లు చెప్పారు. కరోనాతో మృతి చెందిన కుటుంబసభ్యులకు వినమ్రపూర్వక శ్రద్ధాంజలి అర్పిస్తున్నట్లు రెండు చేతులు జోడించి తెలిపారు. బ్లాక్ ఫంగస్ కొత్త ఛాలెంజ్ అని, దానికి సర్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పరిశుభ్రత పాటించాలని, కాశీని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాశీకి, అక్కడి ప్రజలందరికీ కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ముఖ్యంగా వైద్యులు, వైద్య సిబ్బంది మొదలుకుని అంబులెన్స్ డ్రైవర్ల అందరికీ అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment