సిక్త్స్ సెన్స్ కాపాడుతుంది!
న్యూయార్క్: మానసిక కలతతో, పరధ్యానంతో డ్రైవింగ్ చేస్తున్నపుడు మన సిక్త్స్ సెన్స్ మనల్ని కాపాడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఫోన్లో మెసెజ్‌లు చేస్తూ వాహనాలను నడుపుతున్న సమయం లో కాకుండా మిగతా అన్ని సమయాల్లో సిక్త్స్ సెన్స్ సక్రమంగా పయనించేలా చేస్తుం దని తేలింది. ఈ మేరకు 59 మందిపై అమెరికా హూస్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు సర్వే నిర్వహిం చారు. సాధారణ స్థితిలో, పరధ్యానంలో, భావోద్వేగంలో, ఫోన్లో మెసేజ్ పంపుతున్నపుడు ఇలా 4 స్థితుల్లో డ్రైవింగ్ చేయించారు.