దీని విలువేంటో మీకు తెలీదు.. ఐష్‌ కంటతడి | Aishwarya Lost Cool at Photographers | Sakshi
Sakshi News home page

Nov 21 2017 2:22 PM | Updated on Nov 21 2017 8:07 PM

Aishwarya Lost Cool at Photographers - Sakshi - Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ భావోద్వేగానికి గురయ్యారు. కొందరు ఫోటోగ్రాఫర్‌లు చేసిన పనికి ఆమె మనస్థాపం చెంది స్టేజీపైనే కంటతడి పెట్టుకున్నారు. 

చనిపోయిన తన తండ్రి కృష్ణరాజ్‌ రాయ్‌ పుట్టిన రోజు వేడుకలను ఓ స్వచ్ఛంద సంస్థ తరపున నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సోమవారం ఆమె స్మైల్‌ ఫౌండేషన్‌ తరపున షుష్రుషా ఆస్పత్రిలో ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి ఐశ్వర్య తల్లి బృంద, కూతురు ఆరాధ్య కూడా హాజరయ్యారు. 

అయితే పిల్లలతో కలిసి ఈవెంట్‌ నిర్వహిస్తున్న సమయంలో కొంత మంది ఫ్రీలాన్స్‌ ఫోటోగ్రాఫర్లు పదే పదే ఫోటోలు తీస్తూ.. అరుస్తూ కనిపించటంతో ఆమె అసహనానికి లోనయ్యారు. ‘‘దయచేసి ఆపండి. ఇదేం పబ్లిక్‌ ఈవెంట్‌, సినిమా వేడుకో కాదు. చనిపోయిన వ్యక్తి గౌరవార్థం చేస్తున్న పని. దీని విలువ మీకు తెలీదు. ’’ అంటూ కంటతడి పెట్టడం ప్రారంభించారు. ఇక ఆ ఫోటోగ్రాఫర్లు ఆ మూమెంట్‌ను కూడా క్లిక్‌ మనిపించటం విశేషం.

కాగా, అంతకు ముందు రోజు ఆరాధ్య పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించగా.. పలువురు బాలీవుడ్ తారలు సందడి చేసిన విషయం తెలిసిందే. అన్నింట్లో కన్నా షారూఖ్‌ చిన్న కొడుకు అబ్‌రామ్‌తో అమితాబ్‌ చేసిన సందడే హైలెట్‌గా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement