కేటీఆర్‌ అలా చెప్పడం సిగ్గుచేటు.. | V Hanumantha Rao Fire on KTR | Sakshi
Sakshi News home page

అలా చెప్పడం సిగ్గుచేటు

May 1 2019 7:31 AM | Updated on Sep 19 2019 8:28 PM

V Hanumantha Rao Fire on KTR - Sakshi

గుడి వద్ద వీహెచ్‌

బంజారాహిల్స్‌: ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాలకు కారణమైన గ్లోబరీనా సంస్థ పేరును తాను మొదటిసారి విన్నానని కేటీఆర్‌ చెప్పడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు అన్నారు. ఆ సంస్థ తెలియదని పెద్దమ్మ తల్లిపై ప్రమాణం చేయాలని కేటీఆర్‌కు సవాల్‌ విసిరిన ఆయన... మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం అక్కడ బైఠాయించారు. మధ్యాహ్నం 12గంటల వరకు కేటీఆర్‌ కోసం గుడి బయట వేచి చూశారు. కేటీఆర్‌ రాకపోవడంతో బయటకు వచ్చిన వీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. రెండేళ్లలో ప్రభుత్వం పడిపోవాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. 23 మంది విద్యార్థుల మరణానికి కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement