కేటీఆర్‌ ప్రమాణం చేస్తావా? | V Hanumantha Rao challenge To KTR Over Globarina | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌కు వీహెచ్‌ సవాలు..

Published Mon, Apr 29 2019 5:37 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

V Hanumantha Rao challenge To KTR Over Globarina - Sakshi

వీ హనుమంతరావు(పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వీ హనుమంతరావు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబరీనా ఐటీ కంపెనీ తనకు తెలియదని కేటీఆర్‌ చెప్పడం అబద్ధమని తెలిపారు. గ్లోబరీనా కంపెనీ తెలియదని అమ్మవారి మీద ప్రమాణం చేస్తావా అని కేటీఆర్‌కు సవాలు విసిరారు.

కేటీఆర్‌ రేపు ఉదయం 12 గంటలకు పెద్దమ్మ గుడి వద్దకు రావాలని అన్నారు. ఆయన పెద్దమ్మ గుడి దగ్గరకు రాకపోతే గ్లోబరీనా ఐటీ కంపెనీతో ఆయనకు సంబంధం ఉన్న మాట నిజమని వ్యాఖ్యానించారు. ఐదేళ్లు ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు ఐటీ కంపెనీ గురించి తెలియదా అని ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement