
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, అన్నివర్గాల అభివృద్ధే తమ పార్టీ ధ్యేయమని సీఎల్పీ మాజీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కాం గ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలను మీడియాకు వివరించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్నివర్గాలు మోసపోయాయని అన్నారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని, కేసీఆర్ ఏ హక్కుతో ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్, గ్రామగ్రామాన ఐకేపీ కేంద్రాలు, ఎస్సారెస్పీ నీళ్లు తెచ్చామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, మహిళాసంఘాలకు వడ్డీ లేని రుణాలిస్తామన్నారు. ఇల్లులేనివారికి ప్రభుత్వ స్థలాలతోపాటు సొంతస్థలాల్లో రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణం, దళిత కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల గృహ విద్యుత్, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని వివరించారు. కమీషన్ల కోసమే కేసీఆర్ మిషన్ భగీరథ చేపట్టారని, దీంతో గ్రామాల్లో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయన్నారు.
కేటీఆర్ సీఎం కావాలనుకుంటున్నాడు: వీహెచ్
యాదగిరిగుట్ట: తండ్రి కేసీఆర్‌ను పక్కకు పెట్టి తాను సీఎం కావాలని కేటీఆర్ కల లు కంటున్నాడని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక కమిటీ చైర్మన్ వి.హనుమంతరావు విమర్శించారు. అందుకే ఇటీవల కాలంలో కేసీఆర్ కంటే కేటీఆర్ ఎక్కువగా మాట్లాడుతున్నారని పేర్కొన్నా రు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రాష్ట్ర భట్రాజుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్న విషయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీకి వివరిస్తానన్నారు. తెలంగాణ తల్లి సోనియమ్మను బొమ్మ అని కేటీఆర్ అనడం బాధాకరమన్నారు.
అన్నం పెట్టిన వాళ్లను అమ్మ బొమ్మ అనడం కరెక్టు కాదన్నా రు. ప్రతిపక్షాలు నిందలు మోపడం వల్ల ముం దస్తు ఎన్నికలకు వెళ్తున్నామనడం సిగ్గుచేటన్నారు. 17 సార్లు సర్వేలు చేయించి, 17 మంది జ్యోతిష్యులకు చూపించి సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఆరోపించారు. ఊరూరా తిరిగి టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగడతానని, వచ్చే ఎన్నికల్లో కాం గ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ఇన్‌చార్జి కుంతియాను దూషించినట్లు మాట్లాడటం సరైందికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment