
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని ఏఐసీసీ కార్యదర్శి వీ. హనుమంతరావు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించాక కోర్టు కేసులతో వేలాది నిరుద్యోలు వేచి చూడాల్సి వస్తుందని విమర్శించారు. ఈ ఉద్యోగ సమస్య చిలికి చిలికి గాలివానగా మారక ముందే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
ఏళ్లు గడిచిన పోస్టీంగ్ లేదు: మానవతారాయ్
‘రెండు సంవత్సరాల క్రితం పీఈటీ పోస్టుల కోసం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్షలు కూడా నిర్వహించి, సర్టిఫికేషన్ల వెరిఫికేషన్లు కూడా అయిపోయాగా పోస్టీంగ్ నిలివేశారు. కోర్టు కేసులంటూ ఈ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది’ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీఘావిర్భావ దినోత్సవం అని సంబరాలు చేసుకుంటున్నారు కానీ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలేదని విమర్శించారు.
గురుకుల విద్య సంస్థల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల సంగతి నిర్లక్ష్యం చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో ఒక్క పీఈటీ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. నిరసన కూడా తెలపనీయకుండా అరెస్ట్ చేస్తున్నారు. పీఈటీ ఉద్యోగానికి సెలెక్ట్ కానీ అభ్యర్థులు కేసు వేస్తే ఉద్యోగ భర్తి ఆపుతున్నారు. రెండు సంవత్సరాలు అయినా పోస్టీంగ్ ఇవ్వడం లేదు. ఉద్యోగాల కోసం టీఎస్‌సీఎస్సీకి వస్తే అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జైలులోనే ఉండాలా? ప్రజలే బాస్ అంటున్న కేసీఆర్ ఎందుకు ప్రజలను పట్టించుకోవడం లేదు. సెలెక్ట్ అయిన అభ్యర్థులను జైలులో పెట్టాల్సిన అవసరం ఏముంది. -సైదులు, భార్గవి, పీఈటీ అభ్యర్థులు