
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు పరివర్తనను కోరుకుంటున్నారన్న విషయం తన రథయాత్రలో అర్థమైందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఈ నెల 11 నుంచి 14 వరకు ఉమ్మడి మెదక్‌జిల్లాలో ఇందిరా విజయ రథయాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
తాను పర్యటించిన ప్రతీ చోటా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, గజ్వేల్‌తో పాటు నర్సాపూర్, మెదక్, జహీరాబాద్‌లలో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారని ఆయన చెప్పారు. కేసీఆర్‌ను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు అసహ్యిం చుకుంటున్నారని, ఆయన మోసం చేశారని ప్రజ లకు అర్థమైందని వీహెచ్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తోందని, తాము కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.