భూ మాఫియా ద్వారానే అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, భూ కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరించాలని ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు.
సాక్షి, న్యూఢిల్లీ: భూ మాఫియా ద్వారానే అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, భూ కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరించాలని ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రెవెన్యూ శాఖలో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల్లో జరుగుతున్న అవకతవకలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొరడా ఝలిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భూ కబ్జాల విషయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు పార్టీ మారడం తప్ప ఏమీ జరగలేదని ఎద్దేవా చేశారు. ప్రధానిగా రాజీవ్‌గాంధీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేసేందుకు రాష్ట్రమంతా పర్యటిస్తానని తెలిపారు.