
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాకను కాంగ్రెస్‌లో ఎవరూ వ్యతిరేకించొద్దని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) పేర్కొన్నారు. అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక పార్టీ నేతలందరూ సర్దుకుపోవాలని అన్నారు.
గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి రావాలని తాను ఎప్పటి నుంచో కోరుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్ర మోదీ తుంగలోతొక్కారని విమర్శించారు. జీఎస్టీతో చిన్న చిన్న వ్యాపారులు రోడ్డున పడ్డారని అన్నారు. బోఫోర్స్ కుంభకోణంతో రాజీవ్ గాంధీకి సంబంధం లేదని 2005 లోనే కోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ కేసును మళ్లీ తిరగదో డాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని అన్నారు. బోఫోర్స్ కేసు తిరగదోడితే.. అమిత్ షా, మోదీలపై ఉన్న కేసులను కూడా తిరగదోడాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment