సాక్షి, హైదరాబాద్: అనుమతులు ఉన్న వాళ్ళు హైడ్రాకు భయపడాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే, పేదలు ఎవరైనా ఫామ్‌హౌస్‌లు కట్టుకోగలుగుతారా? ప్రశ్నించారు. బుల్డోజర్ సిద్ధంగా ఉంచాను.. ఎవరు అడ్డం వచ్చి పడుకుంటారో రండి అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి శనివారం చార్మినార్ వద్ద మాట్లాడుతూ.. తెలంగాణలో అక్రమార్కుల కంటికి కునుకు లేకుండా చేస్తాను. ఈరోజు మూసీ దగ్గరికే వచ్చా.. సవాలు విసిరిన హరీష్ ఎక్కడ పోయాడు?. హైడ్రా అనగానే ఈటల, హరీష్, కేటీఆర్ బయటకి వచ్చారు. హైడ్రాకి పేదలు ఎవరూ భయపడడం లేదు. చెరువులు, నాలాలు ఆక్రమించుకున్న వాళ్లు భయపడుతున్నారు. అనుమతులు ఉన్న వాళ్ళు హైడ్రాకు భయపడాల్సిన అవసరం లేదు. అధికారులు అడిగినప్పుడు మీ అనుమతి పత్రాలు చూపించండి.
రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడతాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరూ భయపడకండి. పెద్దలను కట్టడి చేసి పేదలకు పంచుతాం. నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం. మురికిలో మునిగి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సాయం చేస్తాం. హైడ్రా వేరు, మూసీ ప్రక్షాళన వేరు. పేదలు తాగే నీళ్ళలో డ్రెనేజీ కలిపే వాళ్ళని చెరువులో తోక్కుతాం
బుల్డోజర్ ఖాళీగా ఉంచాను. ఎవరు అడ్డం వచ్చి పడుకుంటారో రండి. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమంగా కట్టుకోలేదా.. పోయి చూద్దాం రండి. అజీజ్ నగర్‌లో హరీష్ ఫామ్ హౌస్ లేదా?. తన ఫామ్‌హౌస్ మీదికి బుల్డోజర్ వస్తుందని కేటీఆర్, హరీష్ భయపడుతున్నాడు. హరీష్, కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి నిజనిర్ధారణ కమిటీని పంపిస్తాం. మూసీని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇళ్లను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment