
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు అన్యాయం జరగకుండా వారికి సముచిత స్థానం కల్పించేలా ఈ ఎన్నికల్లో 34 స్థానాలు కేటాయిం చాలని పార్టీ అధిష్టానా న్ని కోరినట్లు ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 54 శాతం ఉన్న బీసీలకు కాంగ్రెస్ పార్టీ సహా, ప్రజాకూటమిలోని పార్టీలు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందన్నారు.