‘ప్రతిపక్షం లేకుండా చేయాలని బీజేపీ కుట్ర’
హైదరాబాద్: దేశంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలని బీజేపీ పన్నుతోందని కాంగ్రెస్ సీనియర్ వి. హనుమంతరావు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. అందుకే కేసులు ఉసిగొల్పి డబ్బు ఆశ చూపి అన్ని పార్టీల వారిని బీజీపీలో చేర్చుకుంటున్నారని నేత వీహెచ్ అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలోని సెక్యులర్ పార్టీలన్ని ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలను ఏ విధంగా వేధిస్తోందో ప్రజలు గమనిస్తున్నారు.
నిన్నటి వరకు ప్రధానిని తిట్టిపోసిన బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ రోజు మోదీని ఆకాశానికి ఎత్తుతున్నారు. దీని వెనుక మతలబేంటో? ఇక రాష్ట్రం విషయానికి వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్న చందంలా మారిందని ఆయన అన్నారు. తెలంగాణలో దళిత, బలహీన వర్గాలను టీఆర్ఎస్ సర్కార్ అణిచివేయాలని చూస్తోందన్నారు.