వీహెచ్‌కు ‘అర్జున్‌ రెడ్డి’ స్ట్రాంగ్‌ మెసేజ్‌ | Arjun reddy strong message for Chill thathayya VH | Sakshi
Sakshi News home page

వీహెచ్‌కు ‘అర్జున్‌ రెడ్డి’ స్ట్రాంగ్‌ మెసేజ్‌

Published Wed, Aug 30 2017 9:31 AM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

వీహెచ్‌కు ‘అర్జున్‌ రెడ్డి’ స్ట్రాంగ్‌ మెసేజ్‌ - Sakshi

వీహెచ్‌కు ‘అర్జున్‌ రెడ్డి’ స్ట్రాంగ్‌ మెసేజ్‌

అర్జున్‌ రెడ్డి సినిమా పోస్టర్లను చింపి వివాదం చేసిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వి.హనుమంతరావుకు హీరో విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియా వేదికగా మరో మెసేజ్‌ పెట్టాడు.  
డియర్‌ తాతయ్య.. 
 అర్జున్‌ రెడ్డి సినిమాను ప్రశంసించిన కేటీఆర్‌ నాకు బంధువైతే మరి సినిమా నచ్చిన వాళ్లంతా కూడా బంధువులవుతారా..అంటూ సెటైరిక్‌గా ‘రాజమౌళిగారు మా నాన్న. హీరోలు రానా, నాని, శర్వానంద్‌, వరుణ్‌ తేజ్‌లు నా బ్రదర్స్‌. నాకు చెల్లెళ్లు ఉంటే ఫీలింగ్‌ ఎలా ఉండేదో తెలియదు కాబట్టి సమంత, అనూ ఇమ్యనూల్‌, మెహ్రీన్‌ పిర్జాదాలు నా మరదళ్లు.
 
ఐదు రోజుల్లో ఐదువేలకు పైగా షోలను హౌస్‌ ఫుల్‌ చేసిన నా విద్యార్థిని, విద్యార్ధులు నా తోబుట్టువులు. ఇక ఆర్‌జీవీ సర్‌ మన ఇద్దరిలో ఎవరికి తండ్రో ఇంకా స్పష్టత లేదు. చిల్‌ తాతయ్య ప్రేమతో విజయ్‌ దేవరకొండ’. అంటూ ముగించాడు. గత వారం విడుదలైన అర్జున్‌రెడ్డి  బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించి ప్రముఖుల ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్లు రాబడుతోంది.
 
ఇక అంతకు ముందు వీహెచ్‌... కేటీఆర్ లాంటి నేతలు ఈ సినిమాను సమర్థిస్తూ మాట్లాడటం మంచిది కాదన్నారు. ముద్దు సన్నివేశాలు, డ్రగ్స్, బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాను బాగుందంటూ వ్యాఖ్యానించిన కేటీఆర్.. సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. హీరో పాత్రతోనే డ్రగ్స్ తీసుకున్నట్టు చూపిస్తే ఇక తెలుగు సినిమాకు విలువెక్కడుందని వీహెచ్ ప్రశ్నించారు .
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement