తెలంగాణ తొలి మెగాస్టార్ అతనే!
విజయ్ దేవరకొండపై వర్మ ప్రశంసలే ప్రశంసలు
విజయ్ దేవరకొండ రొమాంటిక్ డ్రామా 'అర్జున్ రెడ్డి' విజయయాత్ర కొనసాగుతోంది. ఇటు ప్రేక్షకులు, అటు ప్రముఖులు, విమర్శకుల నుంచి ప్రశంసలందుకుంటున్న ఈ సినిమాపై తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యంగ్‌హీరో విజయ్‌ను వర్మ ప్రశంసలతో ముంచెత్తారు.
'ఇప్పటి హీరోలంతా హీరోయిజాన్ని ప్రదర్శించేందుకు చెవులు బద్దలయ్యే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కూడిన స్లో మోషన్, ర్యాంపింగ్ షాట్స్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. హీరోగా కనిపించడానికి ఇలాంటి స్లో మోషన్, ర్యాంపింగ్ షాట్స్ అవసరం లేకుండా నాకు ఇప్పటివరకు కనిపించిన మొదటి నటుడు విజయ్ దేవరకొండ. అతని కళ్లు, అతని గొంతు అతని నుంచే ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను ప్రసరిస్తున్నాయి' అని వర్మ విశ్లేషించారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, హాలీవుడ్ నటుడు ఆల్ పసినోతో విజయ్‌ను పోలుస్తూ వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. 'వివిధ కెమెరా స్పీడ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నడుమ కెమెరా ముందు క్రియేటైన టెక్నీకల్ ఎమోషన్‌కు తగ్గటు నిలబడగలిగిన నటుడిని చూడటం చాలా అరుదు. అమితాబ్ బచ్చన్ తర్వాత సినిమాటిక్ టెక్నిక్ అవసరం లేకుండా అదే తీవ్రతతో కెమెరా ముందు నిలబడగలిగిన నటుడు విజయ్ దేవరకొండ. యంగ్ అమితాబ్ బచ్చన్, యంగ్ ఆల్ పసినో మేలు కలయిక విజయదేవరకొండ. కొత్త తరం హీరోగా అతను ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తాడని నేను బలంగా భావిస్తున్నా. టాలీవుడ్ అమితాబ్ బచ్చన్‌గా, తెలంగాణ తొలి మెగాస్టార్‌గా అతను నిలుస్తాడని నేను కచ్చితంగా చెప్పగలను' అని వర్మ పేర్కొన్నారు. ఆయన పూర్తి వ్యాసం ఫేస్‌బుక్ పేజీలో చూడొచ్చు.