![Congress Leader V Hanumantha Rao Fires On KTR - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/18/V-Hanumantha-Rao.jpg.webp?itok=-UcS9p_e)
సాక్షి,హైదరాబాద్ : మహాకూటమిని గెలిపించాలని యూపీఏ ఛైర్‌పర్శన్ సోనియా గాంధీ పిలుపిస్తే చాలు.. గెలుపు ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి వి. హనుమంతరావు(వీహెచ్) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...మహాకూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానన్నారు. ఒలిగొండ, యాదగిరి గుట్ట, వేములవాడ, సిరిసిల్లలో తన ప్రచారం ఉంటుందని వెల్లడించారు.
కాంగ్రెస్‌లోని అసంతృప్తి నేతలకు అదిష్టాన దూతలు సర్ది చేబుతున్నారని, అంతా కలిసి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. పార్టీ టికెట్ దక్కని నేతలకు భవిష్యత్తులో ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇచ్చి గౌరవిస్తామపొ పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల టికెట్లను అమ్ముకుంటుదని వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. నాంపల్లి టికెట్ ఆనంద్ గౌడ్‌కు ఇచ్చి మార్చడం పట్ల ఎలా సమర్థించుకుంటున్నారని ప్రశ్నించారు. సిరిసిల్లలొ కేటీఆర్ థర్డ్ డిగ్రీ ఇచ్చిన అంశాన్ని ప్రజలు ఎప్పటికి మర్చిపోరన్నారు. కేటీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని వీహెచ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment