
సాక్షి, హైదరాబాద్: కొత్త నిర్మాణాల్లో కమీషన్లకోసమే సచివాలయం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే నిధుల్లేవని చెబుతున్న కేసీఆర్‌కు కొత్త సచివాలయం కట్టడానికి డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు.
సచివాలయ స్థలాన్ని షాపింగ్‌మాల్స్‌కు కట్టబెట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని వీహెచ్ ఆరోపించారు. కమీషన్లు దండుకోవడానికే కొత్త సచివాలయమని..సచివాలయానికే వెళ్లడం చేతకాని సీఎం కేసీఆర్‌కు కొత్తది ఎందుకన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి కొత్తగా ఉద్యోగాలు ఇప్పించారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.