
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ దగ్గర సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు సంబంధించిన కిటుకు ఏదో ఉందని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు అన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు సంబంధించిన కిటుకు మోదీ దగ్గర ఉండటం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగినా నోరు విప్పడం లేదని విమర్శించారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా కేసీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీలు ఎందుకు నోరు విప్పడంలేదని ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేక హోదాను అడిగిన ఎంపీ కవితకు రాష్ట్రానికి జరుగుతున్న అన్యా యం కనబడలేదా అని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే అన్నీ చేస్తామని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్ ఇప్పటికీ చేసిందేమీలేదన్నారు. కార్పొరేటర్లను ఉత్సవ విగ్రహాలను చేసి, మంత్రి కేటీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జీహెచ్‌ఎంసీలో వసూలు చేసిన పన్నులను మిషన్ భగీరథకు ఖర్చు చేస్తున్నారన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సర్కిళ్లలో బోధన సిబ్బంది, సౌకర్యాలు, ల్యాబ్‌లు, కంప్యూటర్లు లేవని, వెంట నే వీటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment