మేడిపల్లికి రాహుల్‌ను తీసుకొస్తా: వీహెచ్‌ | v hanumantharao on Pharma City | Sakshi

మేడిపల్లికి రాహుల్‌ను తీసుకొస్తా: వీహెచ్‌

Oct 15 2017 2:00 AM | Updated on Sep 19 2019 8:28 PM

v hanumantharao on Pharma City - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మేడిపల్లి లో ఫార్మా సిటీ ఏర్పాటు ను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏకపక్ష ధోరణి తో భూసేకరణ చేపడుతోందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆరోపిం చారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మాట్లా డారు.

ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన భూములను ప్రభుత్వం అక్రమంగా సేకరిస్తోం దని విమర్శించారు. ఫార్మా సిటీతో కాలుష్యం తీవ్రమవుతుందని ప్రజలు చెబుతున్నారని, ప్రభుత్వం మాత్రం వారి ఆందోళనను పట్టించు కోకపోవడం బాధాకరమన్నారు. త్వరలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీని మేడిపల్లికి తీసుకొస్తానన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తామని, బలవంతపు భూసేకరణను అడ్డుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement