క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త
కరీంనగర్: దుబాయ్ నుంచి వ చ్చిన రోజే భార్యను హత్య చేశా డో భర్త. అనంతరం తా నూ క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన మేడిపల్లి మండలం తొంబరావుపేటలో చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన రాయంచు లింగం, జల దంపతులు. వీరికి కూతురు, కుమారుడు సంతానం. కూతురుకు పెళ్లయ్యింది. కుమారుడు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. దంపతులు తమకున్న కొద్దిపాటి భూమి లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం లింగం కూడా ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అప్పటినుంచి జల ఇంట్లో ఒంటరిగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటోంది.
ఆదివారం గల్ఫ్ నుంచి వచ్చిన లింగం రాత్రి సమయంలో భార్యతో గొడవ పడ్డాడు. ఏం జరిగిందో తెలియదుగానీ భార్య నిద్రిస్తున్న సమయంలో పారతో తలపై బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన జల మంచంపైనే మృతిచెందింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న లింగం సోమవారం వేకువజామున క్రిమి సంహారక మందు తాగి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. దీంతో పోలీసులు వెంటనే లింగంను చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆనుపత్రికి తరలించారు.
మృతురాలి సోదరి బింగి సారం విజయ ఫిర్యాదు మేరకు హత్య కేసుగా న మోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్సె శ్యాంరాజు తెలిపారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలి యాల్సి ఉందన్నారు. కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాక మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఇది మొదటి హత్యకేసు అని కోరుట్ల ఇన్‌చార్జి సీఐ నిరంజన్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment