డ్రగ్స్ పెరగడానికి ప్రభుత్వమే కారణం: వీహెచ్
Published Sat, Jul 22 2017 4:18 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM
వరంగల్: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో పెద్దల పేర్లు బయటికి రాకుండా.. మియాపూర్ భూకుంభ కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు దాని పై నుంచి దృష్టి మరల్చేందుకు డ్రగ్స్ వ్యవహారాన్ని బయటకు తీశారని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. ఆయన శనివారం వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ' డ్రగ్స్ విపరీతంగా పెరగడానికి ప్రభుత్వమే కారణం. 2019 లో టీఆఎర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు. మెడల్ సాధించిన వారి మెడలో బంగారు పథకాలు వేసి అమాయక ప్రజలను మాత్రం మోసం చేశారు.
వారం రోజుల క్రితం మురళి అనే కార్పొరేటర్ ను చంపిన నిందితులు నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. హత్యచేసిన విక్రమ్ తన తండ్రిని మురళి హత్య చేయడంతో ప్రతీకారంతో ఈ పని చేశాడు. కొడుకు చనిపోయిన బాధలో వున్న నాయిని రాజేందర్ రెడ్డి పై పోలీసులు రాజకీయ ఒత్తిడితో అక్రమంగా ఈ కేసులో ఇరికించారు. చనిపోయిన వ్యక్తి భార్య, పిల్లలు కూడా నాయిని పేరు చెప్పలేదు. పోలీసులపై ఇంకా నమ్మకం ఉంది. చార్జీ షీట్ నుండి నాయిని రాజేందర్ రెడ్డి పేరు వెంటనే తొలగించాలలి' అని డిమాండ్ చేశారు .
Advertisement
Advertisement