కాంగ్రెస్ పార్టీ మనోభావాలు దెబ్బతీయొద్దు
శంషాబాద్ ఎయిర్పోర్ట్ పేరు మారిస్తే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి ఎన్. చంద్రాబాబు నాయుడిని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా చంద్రబాబు ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అక్రమ భూముల స్వాధీనంపై సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విచారణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు వీహెచ్ సూచించారు.