
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. మద్యం ధరలను పెంచే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
ఉద్యమ సమయంలో ‘తెలంగాణ జాగో ఆంధ్రావాలా భాగో’అన్న కేసీఆర్ ఇప్పుడు వారినే దగ్గరికి తీసుకుంటున్నారని, తెలంగాణ ప్రజలకంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కేసీఆర్‌కు ఎక్కువైపోయారన్నారు. రాష్ట్రంకోసం ఉద్యమించిన ఉస్మానియా విద్యార్థులే ఇప్పుడు టీఆర్‌ఎస్‌పై తిరగబడుతున్నారని చెప్పారు.