‘ఫిరాయింపులపై కేసీఆర్ను తప్పుపట్టలేం’
హైదరాబాద్: ఫిరాయింపుల అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను తప్పుపట్టలేమని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ తెలిపారు. హైదరాబాద్లో శనివారం ఆయన మాట్లాడుతూ తప్పుంతా టీఆర్ఎస్లో చేరే కాంగ్రెస్ నేతలదే అన్నారు.
సీఎంగా కేసీఆర్ 7 నెలల పాలనపై తప్పులు చేప్పలేమన్నారు. నిజాం రాజు లౌకికవాది..నిజాం పాలనలో తప్పులు జరిగాయనేది తెలియదని ఆయన తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న సంఘ్ నేతలపై ప్రధాని మోదీ వైఖరి తెలియజేయాలన్నారు. దేశంలో ఉగ్రవాదుల దాడులతో ప్రజలు భయాందోళనలో ఉన్నారని, దీనిపై ప్రధాని మోదీనే బాధ్యత వహించాలన్నారు.