
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న నల్ల కుబేరులకు ప్రధాని నరేంద్ర మోదీ కొమ్ముగాస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రోజుకో అవినీతి, భారీ కుంభకోణాలతో ప్రజలను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంబానీలతో మోదీ అంటకాగుతూ పెద్ద నోట్లను రద్దు చేశారని ఆరోపించారు. డబ్బులను బ్యాంకుల్లో వేయాలని పేద, మధ్య తరగతి ప్రజలకు చెప్పి నల్ల కుబేరులకు అప్పనంగా కట్టబెడుతున్నారని, ప్రజలను మోసం చేయడానికి ప్రోత్సహిస్తున్నారని వీహెచ్ ఆరోపించారు.