కేసీఆర్‌కు అంత భయమెందుకు?: వీహెచ్‌ | V Hanumantha Rao Slams KCR In Hyderabad | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు అంత భయమెందుకు?: వీహెచ్‌

Published Thu, Dec 6 2018 3:26 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

V Hanumantha Rao Slams KCR In Hyderabad - Sakshi

వి. హనుమంత రావు

సీఎం కేసీఆర్‌ ఇంటిపై, ప్రగతి భవన్‌పై పోలీసులు దాడులు చేయమంటే..

హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇంటిపైకి 50 మంది పోలీసులను పంపి దాడులు చేయించడం ఏ మేరకు సబబని కాంగ్రెస్‌ నేత వీ హనుమంత రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్‌కు అంత భయమెందుకని సూటిగా అడిగారు. పోలీసులు కూడా టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేయండని చెబుతున్నారని ఆరోపించారు. కూకట్‌పల్లి ప్రాంతంలో పోలీసు అధికారులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ ఇంటిపై, ప్రగతి భవన్‌పై పోలీసులు దాడులు చేయమంటే చేస్తారా అని ప్రశ్నించారు. 108,104 వాహనాల్లో డబ్బులు, మద్యం తరలిస్తున్నారని, కాంగ్రెస్‌, తెలుగుదేశం కార్యకర్తలు 108,104 వాహనాలను తనిఖీలు చేయాలని సూచించారు. తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి చెడ్డపేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. మహిళలని కూడ చూడకుండా పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement