కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు
హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో వాగ్దానాలకే పరిమితం అయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లో విలేకరులతో వీహెచ్ మాట్లాడుతూ..కేసీఆర్ ఒక్క వాగ్దానం కూడా సరిగా నెరవేర్చలేదని అన్నారు. నిరుద్యోగులు మహాకూటమిని గెలిపించాలని కోరారు. యువత మొత్తం ప్రజా కూటమికి అండగా నిలిచిందని, 5 సంవత్సరాలు పాలించలేని కేసీఆర్‌కు ఓటు వేటువద్దని ప్రజలు నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్‌లో గిరిజనుల ఓట్లు, హైదరాబాద్‌లో కూడా కొన్ని చోట్ల కావాలనే ఓట్లు తొలగించారని ఆరోపించారు.
ప్రజా కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. మేమిచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ఈవీఎంలు పింక్ కలర్‌లో పెట్టారని, దాని వల్ల గుర్తు వెతుక్కోవడానికి తనకే టైం పట్టిందని విమర్శించారు. సోనియా, రాహుల్ పర్యటన వల్ల ప్రజాకూటమికి బాగా కలిసి వచ్చిందన్నారు. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment