తెలంగాణ సంస్కృతిని కేసీఆర్‌ నాశనం చేస్తుండు | VH Fires on CM Kcr | Sakshi
Sakshi News home page

తెలంగాణ సంస్కృతిని కేసీఆర్‌ నాశనం చేస్తుండు

Published Tue, Jul 4 2017 6:34 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

తెలంగాణ సంస్కృతిని కేసీఆర్‌ నాశనం చేస్తుండు - Sakshi

తెలంగాణ సంస్కృతిని కేసీఆర్‌ నాశనం చేస్తుండు

హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతిని సీఎం కేసీఆర్ నాశనం చేస్తుండని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. గడీల పాలన చేస్తున్నావా అని సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ ఫోన్ చేసినా మాట్లాడకుండా అవమానపరిచాడని ఆయన మండిపడ్డారు. గ్రామ గ్రామాన తిరిగి గడీల పాలనను అంతం చేస్తామని హెచ్చరించారు.

జీఎస్టీ వల్ల నష్టం జరుగుతుందని ఈటల రాజేందర్ అంటే.. నష్టం ఏమి లేదని సీఎం అనడం శోచనీయమన్నారు. అసలు ఎవరు తప్పు చెబుతున్నారు కేసీఆరా? లేక ఈటలనా? అని సూటిగా అడిగారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి కేసీఆర్ భజన చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement